తెలుగు సినీ పరిశ్రమలో విశ్వవిఖ్యాత నటుడిగా సార్వభౌముడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు సీనియర్ ఎన్టీఆర్. తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడు కూడా ఈయనే కావడం విశేషం. పౌరాణిక చిత్రాల్లో ఈయన చేసిన పాత్రలు ఇప్పటివరకు ఇండియాలో ఉన్న ఏ ఒక్క నటుడు కూడా పోషించలేదు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇలాంటి క్రమంలోనే ఆయన ఇండస్ట్రీలో చాలా పాత్రలను చేసి మెప్పించాడు.
Advertisement
తనతో పాటు స్టార్ హీరోగా ఎదిగిన మరో నటుడు నాగేశ్వరరావు. వీరిద్దరినీ ఇండస్ట్రీకి రెండు కళ్లు అభివర్ణిస్తూ ఉంటారు. వీళ్లిద్దరూ స్టార్ హీరోలుగా ఉన్నప్పుడే సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. తాను వీళ్లేవ్వరినీ పట్టించుకోకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్లాడు. ఇలాంటి క్రమంలోనే అల్లూరి సీతారామరాజు సినిమాని ఎన్టీఆర్ తీయాలనుకున్నాడు. ఆ సినిమా ని కృష్ణ తీసి మంచి సక్సెస్ సాధించాడు. దీంతో ఎన్టీఆర్ కూడా కృష్ణ ను మెచ్చుకున్నాడు. ఆ తరువాత వీరిద్దరికీ సినిమాల పరంగా కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది.
Advertisement
వాస్తవానికి సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన దేవదాస్ సినిమాని ఎన్టీఆర్ దగ్గర ఉండి మరీ నాగేశ్వరరావుతో చేయించాడు. ఆ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ ని కృష్ణ పట్టించుకోవడం లేదనే కారణంతోనే కృష్ణని కాదని ఎన్టీఆర్ తో నాగేశ్వరరావుతో దేవదాస్ సినిమా చేసేవిధంగా ప్రణాళికలు రూపొందించాడు. ఎన్టీఆర్-కృష్ణ మధ్య కొద్ది రోజుల పాటు కోపతాపాలున్నప్పటికీ ఆ తరువాత వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కలిసిపోయారు. వీరిద్దరి మధ్య విభేదాలున్నప్పుడు కృష్ణ చేయాల్సిన సినిమాలను ఎన్టీఆర్ సపోర్టుతో నాగేశ్వరరావు చేసి మంచి హిట్లు కొట్టాడు. వీరిద్దరి గొడవలో ఎక్కువగా లాభపడింది మాత్రం నాగేశ్వరరావు అనే చెప్పాలి. ఇండస్ట్రీలో కొందరి మైనస్ లు మరికొందరికీ ప్లస్ అవుతాయి. అందుకే ఇండస్ట్రీలో ఏం చేసినా ఎవ్వరితో మాట్లాడిన జాగ్రత్తగా ఉండాలి.
Also Read : బావగారు బాగున్నారా సినిమా లో సౌందర్య ని తీసేసి రంభ ని ఎందుకు తీసుకున్నారంటే ?