Home » RAZAKAR MOVIE REVIEW IN TELUGU : రజాకార్ మూవీ రివ్యూ.. తొలి సినిమాతోనే రికార్డులు క్రియేట్ చేశాడా..?

RAZAKAR MOVIE REVIEW IN TELUGU : రజాకార్ మూవీ రివ్యూ.. తొలి సినిమాతోనే రికార్డులు క్రియేట్ చేశాడా..?

by Anji
Ad

RAZAKAR MOVIE REVIEW IN TELUGU :  ఈ మధ్య కాలంలో వాస్తవ సంఘటనలతో చాలా సినిమాలు వస్తున్నాయి. చరిత్రని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా `రజాకార్‌` అనే సినిమా వచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యాన్ని నిజాం నవాబ్‌ కోణంలో, కేంద్ర హోంమంత్రి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కోణంలో చెబుతూ ఈ మూవీని తెరకెక్కించారు. దీంతో ఇది కాస్త వివాదంగా మారింది. ఆపాలంటూ కోర్టులో పిటిషన్‌ కూడా దాఖలయ్యింది. అన్నింటిని దాటుకుని రిలీజ్‌ అయ్యింది. యాటా సత్యనారాయణ దీనికి దర్శకత్వం వహించగా, గూడూరు నారాయణరెడ్డి నిర్మించారు. ఇందులో ఇంద్రజ, బాబీ సింహా, అనసూయ, వేదిక, మకరంద్‌ పాండే, ప్రేమ, అనుష్క త్రిపాఠి, రాజ్‌ అర్జున్‌, జాన్‌ విజయ్‌ ప్రధాన పాత్రల్లో నటించారు.  ఇవాళ శుక్రవారం మార్చి 15న ఈ చిత్రాన్ని విడుదల చేశారు.  మరి సినిమా ఎలా ఉందో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

razakaar-review

Advertisement

 

కథ మరియు విశ్లేషణ : 

భారతదేశానికి 1947లో స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 1948లో వచ్చింది. ఇప్పుడున్న తెలంగాణ, కర్ణాటకలోని బీదర్ లాంటి ప్రాంతాలు, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలను కలిపి నిజాం రాష్ట్రంగా నిజాం వంశస్థులు పాలిస్తూ వచ్చేవారు. బ్రిటిష్ వాళ్లు 1947లో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోతున్న సమయంలో నిజాం రాష్ట్రాన్ని మాత్రం వారికి ఇష్టం వచ్చిన వారితో కలవచ్చని చెబుతారు. అప్పటి నిజాం రాజు (మకరంద దేశ్ పాండే)కు నిజాం సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలపడం ఇష్టం లేదు. అలా అని భారతదేశంలో కలపడం కూడా ఇష్టం లేదు తమ దగ్గర ఉన్న రజాకార్లు అనే ప్రైవేటు సైన్యంతో నిజాం సంస్థానాన్ని తుర్కిస్తాన్ గా ఏర్పరచాలని నిర్ణయం తీసుకుంటాడు. అందుకు రజాకారుల చీఫ్ ఖాసిం రిజ్వి( రాజ్ అర్జున్), మంత్రి(జాన్ విజయ్)లు దుర్మార్గానికి దిగుతారు. నిజాం రాష్ట్రంలో బతకాలంటే మతం మార్చుకోవాలి, లేదంటే బానిసలుగా ట్రీట్ చేస్తామని చెబుతూ అనేక రకాల పన్నులు విధిస్తూ ప్రజల రక్తాన్ని పిలుస్తూ ఉంటారు. మరో పక్క భారతదేశ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ (రాజ్ సంపు) ఈ దురాగతాలను తెలుసుకొని ఎలా అయినా భారత దేశంలో నిజాం సంస్థానాన్ని విలీనం చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఎలాంటి తిరుగు బాట్లు ఏర్పడ్డాయి? ఏ ఏ ప్రాంతాల్లో ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు? తిరుగుబాటు చేస్తున్న వారిని రజాకార్లు ఎలా అణగదొక్కే ప్రయత్నం చేశారు? చివరికి విలీనానికి ఎలాంటి పరిస్థితులు కారణమయ్యాయి? లాంటి విషయాలు తెలియాలంటే  థియేటర్లలో వీక్షించాల్సిందే.

Advertisement

నిజాంపాలనలో రజాకారుల అరాచకాలు గురించి ఇప్పటితరం వారికి చాలా వరకు తెలియకపోవచ్చు. ఒకప్పుడు పెద్దలందరికీ ఈ వ్యవహారం అంతా బాగా తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే.. చరిత్ర పుటల్లో ఉన్న అంశాన్ని ఇప్పటితరానికి అందించాలనే ఉద్దేశంతో ఈ మూవీ తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. వాస్తవానికి నిజాం పాలనలో ఒకప్పుడు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఈ సినిమా చూసే వరకు చాలా మందికి తెలియదు. హైదరాబాద్ లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను కళ్లకు కట్టినట్టు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. బిడ్డ పుడితే పన్ను, చనిపోతే పన్ను అంటూ ఎలా వేధించేవారు..? పుష్పవతి అయిన ఆడపిల్లల మీద రజాకార్లు, వాళ్ల ప్రతినిధులు ఎలా అఘాయిత్యాలకు పాల్పడేవారు అనే విషయాలను చూస్తున్న సమయంలో రజాకార్లు కనిపిస్తే వాళ్లు మీద మనమే తిరుగుబాటు చేయాలనేంత కొన్ని సీన్లు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ప్రతీ 20 నిమిషాలు లేదా అరగంటకి ఒక పాత్ర తెరమీదకు వచ్చి చేసే మ్యూజిక్ ఆకట్టుకుంటుంది.

నటీనటుల విషయానికొస్తే.. రాజిరెడ్డిగా బాబీ సింహా, శాంతవ్వగా వేదిక, నిజాం భార్యగా అనుష్య త్రిపాఠి, ప్రేమ, చాకలి ఐలమ్మగా ఇంద్రజ, పోచమ్మ గా అనసూయ భరద్వాజ్, నిజాం రాజుగా మకరంద్ దేశ్ పాండే, సర్దార్ వల్లబాయ్ పటేల్ గా రాజ్ సప్రు, కాసిం రిజ్విగా రాజ్ అర్జున్, నిజాం మంత్రిగా బాన్ విజయ్, యాట సత్యనారాయణ ఇలా ప్రతీ ఒక్కరూ తమ పాత్రల్లో ఇమిడిపోవడమే కాదు.. తమ స్థానంలో వేరెవ్వరూ బాగా నటించలేరేమో అనేంతగా నటించారు. సీరియల్ దర్శకుడు ఆట సత్యనారాయణ సరికొత్త తెలుగు సినిమా దర్శకుడిగా తొలి సినిమాతోనే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. 2గంటల 36 నిమిషాల పాటు ఉన్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజింగ్ గా చేయడంలో ఎడిటర్ సక్సెస్ అయ్యాడు.

పాజిటివ్ పాయింట్స్ : 

  • డైరెక్టర్
  • బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • ఎడిటర్
  • నటీనటులు

మైనస్ పాయింట్స్ : 

  • కమ్యూనిస్టుల పాత్రను పక్కకు పెట్టడం

రేటింగ్ : 3.5/5 

Also Read : మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్స్ వీరే..!

Visitors Are Also Reading