Home » మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్స్ వీరే..!

మోహన్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్స్ వీరే..!

by Anji
Published: Last Updated on

తెలుగు సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా తనకు అంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న మోహన్ బాబు తొలుత చేసిన చాలా సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. మోహన్ బాబు ఇండస్ట్రీకి వచ్చిన తొలుత విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. తరువాత హీరోగా మారి వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి మోహన్ బాబు సినిమాలు లేకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా మోహన్ బాబు చాలా ఫేమస్. కొంత దర్శకులు చేసిన సినిమాలతో భారీ హిట్లు అందుకున్నాడు మోహన్ బాబు. అందులో ముఖ్యంగా దర్శకుడు బి.గోపాల్ మోహన్ బాబుకి మంచి విజయాలను అందించాడు. అసెంబ్లీ  రౌడీ, అడవిలో అన్న, కలెక్టర్ గారు వంటి సినిమాలతో స్టార్ హీరోని చేశాడు. రాఘవేంద్ర రావు కూడా అల్లుడు గారు, మేజర్ చంద్రకాంత్.. రవి రాజా పినిశెట్టి కూడా మోహన్ బాబుకి పెదరాయుడు వంటి ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ ని సంపాదించుకుంది.

 

మోహన్ బాబు స్టార్ హీరో అవ్వడానికి తను కూడా చాలా హెల్ప్ చేశాడనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే మరి కొంతమంది దర్శకులు కూడా మోహన్ బాబుని స్టార్ హీరోని చేయడానికి హెల్ప్ చేశారు. అయినప్పటికీ ముఖ్యంగా వీళ్లు మాత్రం వరుస సినిమాలను చేసి మంచి విజయాలను అందించడమే కాకుండా ఆయనను  స్టార్ హీరోగా మార్చడంలో చాలా వరకు హెల్ప్ చేశారనే చెప్పవచ్చు.

Also Read :  టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి ఫిక్స్ .. ఎప్పుడంటే..?

Visitors Are Also Reading