మన ప్రపంచంలో అనేక రకాల ఆటలు ఉన్నాయి. చాలామంది క్రీడాకారులు ఉన్నారు. అలాగే ఫ్యాన్స్ కూడా అన్ని ఆటలకు ఉంటారు. కానీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు మాత్రమే మంచి క్రేజ్ ఉంది. ఎక్కడ చూసినా క్రికెట్ గురించే మాట్లాడుకుంటారు జనాలు. దానికి తగ్గట్టుగానే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ మరియు బీసీసీఐలు కూడా….. క్రికెట్ లో అనేక మార్పులను చేస్తున్నాయి.
క్రికెట్ లవర్స్ ఎంటర్ టైన్ చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. సరికొత్త రూల్స్ తీసుకువస్తూ క్రికెట్ రూపురేఖలను మార్చేస్తోంది ఐసీసీ. వన్డేలు మరియు టి20 లు అంటూ… క్రికెట్ పై ఆసక్తి పెరిగేలా చర్యలు తీసుకుంటోంది ఐసీసీ. ఇలాంటి నేపథ్యంలోనే మరో కీలక ప్రకటన చేసింది ఐసీసీ.
Advertisement
బ్యాటర్లకు ప్రయోజనం కలిగేలా ఐసీసీ ఓ సరికొత్త రూల్ ను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు కీపర్ స్టంపింగ్ ను అప్పీలు చేసినప్పుడు ఫీల్డ్ ఎంపైర్లు థర్డ్ అంపైర్ కు రిఫర్ చేస్తే…. ఆయన తోలుత క్యాచ్ ను చెక్ చేసి తర్వాత స్టంప్ అవుట్ ను పరిశీలించేవారు. దీనివల్ల ఫీల్డింగ్ జట్టుకు రెండు రకాలుగా ప్రయోజనం చేకూరేది. ఇకపై అంపైర్లు రిఫర్ చేసిన స్టంప్ అవుట్ ను మాత్రమే థర్డ్ అంపైర్ చెక్ చేస్తారు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.