Home » రేవంత్ రెడ్డి లవ్ స్టోరీలో మరో కొత్తకోణం.. సీఎం కావడానికి కారణం అదేనా..?

రేవంత్ రెడ్డి లవ్ స్టోరీలో మరో కొత్తకోణం.. సీఎం కావడానికి కారణం అదేనా..?

by Anji
Ad

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేశారు. రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి  కృష్ణారావు, దామోదర రాజనరసింహ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్బీ స్టేడియం అంతా జనాలతో కిక్కిరిసిపోయింది. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డికి సంబంధించిన లవ్ స్టోరీ ఓ కొత్త కోణం బయటికి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం కావడానికి ఓ పెద్ద కథనే ఉంది. 

Advertisement

రేవంత్ రెడ్డిది రెడ్డి కమ్యూనిటీ అయినప్పటికీ సాధారణ మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చాడు. తన సొంతంగానే ఎదిగాడు. చిన్నప్పటి నుంచి ముక్కు సూటి మనిషి రేవంత్ రెడ్డి. తాను ఏదైనా అనుకున్నాడంటే.. అది సాధించి నిరూపిస్తాడు. సాధించేవరకు వదిలిపెట్టని మనస్థత్వం కలవాడు. అదే ఇప్పుడు ఆయనను తెలంగాణ రాష్ట్రానికి సీఎం ని చేసింది. రేవంత్ రెడ్డి లవ్ స్టోరీలో ఓ కొత్త కోణం ఇప్పటివరకు బయటికి రాని ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతారెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిది లవ్, ఆ తరువాత పెద్దల అంగీకారంతో చేసిన పెళ్లి. ఇంటర్మీయట్ సమయంలోనే రేవంత్ రెడ్డి, గీతారెడ్డి పరిచయమైంది. ఆ సమయంలోనే ఇద్దరూ మనస్సులు కలిశాయట. నాగార్జున సాగర్ లో ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఆ సమయంలోనే స్నేహం కాస్త ప్రేమగా మారింది. రేవంత్ లవ్ ని గీతా యాక్సెప్ట్ చేసింది.

 

తనను పోషించడం కోసం తాను ఓ వృత్తిలో ఉన్నానని చెప్పడం కోసం రేవంత్ రెడ్డి కొన్నాళ్లు జర్నలిస్ట్ గా మారాడు. ఆయన జా గృతి వార పత్రికలో పేజ్ డిజైనర్ గా పని చేశాడు. కొన్నాళ్లు పల్లకి వార పత్రికలోనూ పని చేశాడు. ఆ తరువాత ఉన్నత విద్యనభ్యసించాడు. రేవంత్ రెడ్డిని గీతారెడ్డి కూడా బలం నమ్మింది. ఆయనను విడిచి ఉండలేకపోయింది. ఆ విషయం వాళ్ల నాన్నకు తెలిసి ఆమెపై సీరియస్ అయ్యాడు. రేవంత్ రెడ్డికి వార్నింగ్ లు కూడా ఇచ్చారట. ఇక్కడ ఉంటే సేఫ్ కాదని.. ఢిల్లీలో ఉన్న అన్న కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి ఇంటికి పంపించాడు. రేవంత్ రెడ్డి డేర్ చేసి ఢిల్లీకి కూడా వెళ్లాడు. వీఐపీ సెక్యూరిటీ ఉన్న జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి గీతారెడ్డిని కలిశాడు. దీంతో జైపాల్ రెడ్డి ఫ్యామిలీ భయపడింది. గీతా రెడ్డి కూడా అతన్ని కోరుకుంది. 

Advertisement

తామె ఎంత చెప్పినా రేవంత్ వస్తున్నాడని.. రేపు ఏదో సమయంలో ఇద్దరూ లేచిపోయినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే తన పరువు పోతుందని భావించాడు జైపాల్ రెడ్డి. దీనికి తోడు రేవంత్ రెడ్డి రాయబారం నడిపించాడు. దీంతో ఎట్టకేలకు దిగొచ్చారు. తమ రెడ్డి కమ్యూనిటీనే కావడంతో బలవంతంగానైనా ఒప్పుకున్నారు. గీతారెడ్డిని పెళ్లి చేసుకున్న తరువాత ఎలా పోషిస్తారనేే ప్రశ్న ఎదురైంది. రేవంత్ ఆర్థిక పరిస్థితిపై వాళ్లు కొంత అవమానంగా మాట్లాడారట. దీనికి రేవంత్ రెడ్డి హర్ట్ అయ్యాడట. తనకు మీడియాలో అనుభవం ఉండటంతో కొన్నాళ్లపాటు ప్రింటింగ్ ప్రెస్ పెట్టాను. ఆ సమయంలో తాము సహాయం చేస్తామని జైపాల్ రెడ్డి ఫ్యామిలీ డబ్బు ఆఫర్ చేశారట. కానీ మీ డబ్బు అవసరం లేదు.. తన భార్యను ఎలా పోషించుకోవాలో, ఎలా చూసుకోవాలో తెలుసు అని చెప్పాడట. తనే కష్టపడి ఆ ప్రింటింగ్ ప్రెస్ నడిపించారు. కొన్నాళ్ల తరువాత దానిని మూసేశాడు. ఆర్థిక స్థితి, ఇమేజ్ గురించి గీతారెడ్డి ఫ్యామిలీ నుంచి కొంత అవమానం ఎదురైందని.. దీంతో అప్పుడు తాను భవిష్యత్ లో రాజకీయ నాయకుడిగా ఎదిగి చూపిస్తానని ఛాలెంజ్ చేశాడట.

సీఎంగా ఎదగాలనేది ఆ దశలోనే రేవంత్ రెడ్డికి కలిగిందని.. ఏబీవీప స్టూడెంట్ ఆర్గనైజేషన్ అనుభవంతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. రేవంత్ రెడ్డి రాజకీయంగా ఎదిగిన తరువాత బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందట. కానీ దానిని తిరస్కరించారట. తనకు కాంగ్రెస్ మాత్రమే కరెక్ట్ అని.. కాంగ్రెస్ లోకి వెళ్లారు. అప్పటికే రేవంత్ రెడ్డి తాను సీఎం కావాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. ఎమ్మెల్సీ చేసిన సమయంలో తరచూ రాజకీయ ప్రముఖులతో చెబుతుండేవాడట. నేను రోజు అయినా సీఎం అయి తీరుతా అని.. ఈ విషయాన్ని ఇటీవలే ప్రొఫెసర్ నాగేశ్వర్ వెల్లడించారు. తనతో ఎప్పుడూ సర్ నేను ఎప్పటికైనా సీఎం అవుతానని చెప్పేవారని.. దానిని నిజం చేసి చూపించాడని వెల్లడించారు ప్రొ.నాగేశ్వర్. మొత్తానికి  రేవంత్ రెడ్డి తెలంగాణకి రెండో  సీఎం కావడం చాలా గ్రేట్ అనే చెప్పవచ్చు.

 

Visitors Are Also Reading