తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నవంబర్ 30వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఏకంగా 64 అసెంబ్లీ సీట్లను సాధించింది. అటు భారత రాష్ట్ర సమితి పార్టీకి ఏకంగా 39 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన ప్రతిపక్షం ఉందన్నమాట.
అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కొన్ని శక్తులు ఏకమయ్యాయి. అలాగే పది సంవత్సరాల సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలు కూడా కాస్త విసిగిపోయారు. నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. అయితే వీటన్నింటినీ క్యాష్ చేసుకున్న రేవంత్ రెడ్డి… కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చాలా కష్టపడ్డారు. భరోసా పేరుతో యాత్రలు అలాగే పాదయాత్రలు చేశారు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి రెవెన్యూ కూడా అంతా తానై చూసుకున్నారు.
Advertisement
Advertisement
ఇక రిజల్ట్స్ విషయానికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. దీంతో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విషయాన్ని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.ఇలాంటి నేపథ్యంలో… తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గతంలో దిగిన ఫోటో వైరల్ గా మారింది. జాగృతి పత్రికలో రేవంత్ రెడ్డి జర్నలిస్ట్‌గా పనిచేసినప్పటి ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.