సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం.. ఇద్దరూ వ్యక్తులు పెళ్లి చేసుకోవాలంటే చాలా నియమ, నిబంధనలుంటాయి. పెళ్లి చూపుల వద్ద నుంచి మొదలు పెడితే.. మూడు ముళ్లు వేసే వరకు ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు ఉంటాయి. ఒక కుటుంబంలో వివాహం జరగాలంటే.. అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో పెళ్లి సంబంధాలు చూడటానికి ముందు కొన్ని విషయాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఇందులో మొట్టమొదటిది ఇంటి పేరు, గోత్రం. ఆ తర్వాత జాతకలు, నక్షత్రాలు, రాశులు ఇతర ప్రతీ అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు.
Advertisement
హిందూ సంప్రదాయ ప్రకారం.. గోత్రం తెలియకుండా ఎవ్వరి వివాహం జరగదు. అంతేకాదు.. వధువు, వరుడి గోత్రం ఒక్కటే అయినట్టయితే.. ఆ పెళ్లి జరగకూడదని మన పెద్దలు చెబుతుంటారు. పెళ్లికొడుకు, పెళ్లి కుమార్తె గోత్రాలు వేర్వేరుగా ఉన్నప్పుడు మాత్రమే వారి వివాహాలు సజావుగా సాగుతాయి. ప్రధానంగా హిందూ మతంలో ఒకే గోత్రం వారితో వివాహాలు ఎందుకు జరగవు.. గోత్రానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గోత్రాలు, సప్త బుుషుల వంశస్తుల రూపంలో ఉంటాయి. సప్త బుుషులలో గౌతముడు, కశ్యపుడు, వశిష్ట, భరద్వాజ, అత్రి, అంగీరసుడు, మృగు మహర్షులు ఉంటారు. పురాణాల ప్రకారం.. వేద కాలం నుంచి గోత్రాలకు గుర్తింపు ప్రారంభమైంది. వాస్తవానికి ఇది రక్త సంబంధీకుల మధ్య వివాహాన్ని నివారించేందుకు స్థాపించబడింది. అప్పటినుంచే ఒకే గోత్రానికి చెందిన అబ్బాయి, అమ్మాయిలు పెళ్లి చేసుకోకూడదని కఠినమైన నియమ, నిబంధనలు రూపొందించడ్డాయి. గోత్రం అంటే మనం పూర్వీకుల కుటుంబానికి చెందిన వారమని అర్థం. ఈ కారణంగా ఒకే గోత్రానికి చెందిన అబ్బాయిలు, అమ్మాయిలు సోదరులు, సోదరీమణుల సంబంధాన్ని కొనసాగిస్తారు. అంతేకాదు.. ఒకే గోత్రంలో వివాహం చేసుకుంటే సంతానం విషయంలో సమస్యలు ఏర్పడతాయి. పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉంటుంది. మరియు పిల్లలు మానసిక, శారీరక వైకల్యాన్ని కలిగి ఉండొచ్చు. హిందూ మతంలో ఐదు లేదా కనీసం మూడు గోత్రాలను వదిలేసి మూడు ముళ్ల కార్యక్రమాన్ని జరుపుతారు.
మూడు గోత్రాలలో మొదటిది సొంత గోత్రం.. రెండోది తల్లి గోత్రం, మూడోది అమ్మమ్మ గోత్రం ఈ మూడు వదిలి మిగిలిన వారిని వివాహం చేసుకుంటే.. వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవు. కొందరు జ్యోతిష్యులు ఏడు తరాల తర్వాత గోత్రం మారుతుందని చెబుతారు. ఏడు తరాలుగా ఒకే గోత్రంలో కొనసాగుతూ ఉంటే.. ఎనిమిదో తరానికి సంబంధించిన గోత్రానికి సంబంధించి వివాహ విషయాలను పరిశీలించవచ్చు. శాస్త్రవేత్తల ప్రకారం.. జన్యుపరమైన సమస్యలు, DNA కారణంగా, ఒకే వంశంలోని రక్త సంబంధీకుల మధ్య వివాహం జరగడం వల్ల పిల్లలకు అనేక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ వంశంలోని దోషాలు, రోగాలు రాబోయే తరాలకు బదిలీ అవుతాయి. దీనిని నివారించడానికి మూడు గోత్రాలను వదిలేసి, ఇతర గోత్రాల వారిని పెళ్లి చేసుకోవడం వల్ల ఏ దోషాలు, రోగాలు రాకుండా పుట్టిన పిల్లలు త్వరగా ఎదిగి మరింత వివేకవంతులవుతారు.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!