చాలామంది డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారు డార్క్ సర్కిల్స్ అందాన్ని పాడుచేస్తాయి. డార్క్ సర్కిల్స్ సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నట్లయితే ఇలా చేయండి. మానసిక ఒత్తిడి, పని భారం, నిద్రలేమి ఇలా అనేక కారణాలు వలన ఈ సమస్య కలుగుతూ ఉంటాయి యోగాతో పాటుగా మెడిటేషన్ చేస్తే మానసిక ప్రశాంతత ఉంటుంది. దాంతో కొంత దాకా కంటి కింద నలుపు తగ్గుతుంది. సరైన నిద్ర ఉంటే కూడా డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి. నిద్ర కోసం, నిద్రకు ఖచ్చితంగా సమయానికి కేటాయించండి. రోజు 7 నుండి 8 గంటల పాటు నిద్రపోండి.
Advertisement
Advertisement
కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం వలన కూడా కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. కళ్ళజోడు ని ఉపయోగిస్తే ఈ సమస్య ఉండదు అలోవెరా జెల్ ని కంటి కింద డార్క్ సర్కిల్స్ పై రాస్తే తగ్గిపోతుంది. అలానే బంగాళదుంప ముక్కల్ని కంటికింద పెట్టుకుంటే కూడా ఈ సమస్య ఉండదు. టీ బ్యాగ్ ని 15 నిమిషాలు ఫ్రిజ్లో పెట్టి తర్వాత కళ్ళపై పెట్టండి డార్క్ సర్కిల్స్ నుండి రిలీఫ్ ని పొందవచ్చు. టమాటా ముక్కల్ని కూడా మీరు పల్చగా కట్ చేసి పెట్టుకోవచ్చు. టమాటా రసంలో నిమ్మరసం చుక్కలు వేసి కంటి కింద మసాజ్ చేస్తే కూడా ఈ సమస్య నుండి బయటపడొచ్చు.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!