Home » 2,679 కోట్లతో లో 3 సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం..!  

2,679 కోట్లతో లో 3 సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం..!  

by Azhar
Ad
తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లో దేశంలోనే ఉన్నతమైన వైద్యం అందుతుంది. అందువల్లే ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా సమయంలో కూడా పక్కరాష్ట్రాల నుండి చాలా మంది హైదరాబాద్ కు వైద్యం కోసం వచ్చారు. ఇంతటి వైద్య సదుపాయం ఉన్న ఈ నగరాన్ని ఇంకా మెరుగుపరచాలని తెలంగాణ ప్రభుత్వం భాగ్య నగరంలో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం కోసం 2,679 కోట్లు జారీ చేసింది.
హైదరాబాద్ లోని ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్ లో ఏర్పాటు చేయాలనీ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇక ఈ మూడు ఆసుపత్రులలో ఎల్బీ నగర్ దానికోసం 900 కోట్లు, సనత్ నగర్ ఆసుపత్రి కోసం 897 కోట్లు అలాగే అల్వాల్ లో ఏర్పాటు చేసే దానికోసం 882 కోట్లు జారీ చేసింది.
ఇక ఇప్పటికే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ గచ్చిబౌలిలో సూపర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇపుడు ఈ కొత్త ఏర్పాటు చేయబోయే మూడు ఆసుపత్రుల నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించాలని కూడా సంబంధిత శాఖకు ప్రభుత్వం ఆదేశాలు పంపింది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading