Home » ధోని ఓ గొప్ప ఫినిషర్ : కేటీఆర్

ధోని ఓ గొప్ప ఫినిషర్ : కేటీఆర్

by Azhar
Ad
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గత కొంత కాలంగా… బ్యాట్ తో సర్రిగా రాణించలేకపోతున్నాడు. కానీ నిన్న చెన్నై సూపర్ కింగ్స్ – ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో తనలో ఫినిషర్ ఇంకా ఉన్నాడు అని ధోని గుర్తు చేసాడు. దాంతో ధోని పై ప్రస్తేతం ప్రశంసల జల్లు కురుస్తుంది.
ఇక తాజాగా తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ కూడా ధోనిని ప్రశంసించాడు. కేటీఆర్ తన సోషల్ మీడియాలో ”నిజానికి వయస్సు కేవలం ఒక సంఖ్య !!! ఈ ధోని నిజంగా అత్యుత్తమ ఫినిషర్… ఈ లెజెండ్ లోని ఛాంపియన్షిప్ రోజురోజుకు పెరుగుతుంది” అని రాసుకొచ్చాడు. కేటీఆర్ తో పాటుగా మాజీ ఆటగాళ్లను కూడా ఈ మ్యాచ్ లోని ధోని ప్రషర్షణ కట్టిపడేసింది.
అయితే ఈ మ్యాచ్ చివరి ఓవర్ లో చెన్నై విజయానికి 17 కావాల్సి ఉండగా.. చివరి నాలుగు బంతులను ధోని వరుసగా.. 6, 4, 2, 6 గా మలిచి.. చెన్నైకి రెండో విజయాన్ని.. ముంబైకి వరుసగా 7వ పరాజయాన్ని రుచి చూపించాడు. ఇక చెన్నై జట్టు తమ తదుపరి మ్యాచ్ ఈ నెల 25న పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading