Home » అమ్మ‌నాన్న అనాథ‌ ఆశ్ర‌మం.. అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న

అమ్మ‌నాన్న అనాథ‌ ఆశ్ర‌మం.. అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న

by Anji
Ad

మ‌తిస్థిమితం కోల్పోయి వింత‌గా ప్ర‌వ‌ర్తించే వారిని చేర‌దీసి, వారిని అక్కున చేర్చుకుంటుంది యాదాద్రి జిల్లా చౌటుప్ప‌ల్‌లోని అమ్మానాన్న అనాథ ఆశ్ర‌మం. వారికి ఆశ్ర‌మ నిర్వాహ‌కులు అన్ని తామై అవ‌స‌రాలు తీరుస్తున్నారు. దాతలూ వారికి తోచినంత సాయం చేస్తూ అండ‌గా నిలుస్తున్నారు. ఈ ఆశ్ర‌మంలో సుమారు 550 మందికి పైగా సేవ‌లందిస్తున్నారు. వీరికి పూజ‌లు, ప్రార్థ‌న‌లు చేసేందుకు ప్ర‌త్యేక ఆల‌యాలు నిర్మాణానికి ఆశ్ర‌మ నిర్వ‌హకులు శంకుస్థాప‌న చేసారు. తెలంగాణ‌లోని యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా చౌటుప్ప‌ల్ అమ్మానాన్న అనాథ ఆశ్ర‌మాన్ని 12 ఏళ్లుగా నిర్వ‌హిస్తున్నారు.

Also Read :  ల్యాప్ టాప్ ర్యాం కంటే ఫోన్ ర్యాం ఎందుకు ఎక్కువగా ఉంటుంది…?

Advertisement

Advertisement

సుమారు 550 మందికి సేవ‌లు అందిస్తున్నారు. దాత‌లు కూడా త‌మ వంతు సహాయ స‌హ‌కారాలందిస్తున్నారు. అయితే వారికి ఓ పుణ్య‌క్షేత్రం కావాల‌ని నిర్ణ‌యించారు. ఈ మేర‌కు రూ.30కోట్ల‌తో నిర్మించే భ‌వ‌నాల‌కు ఆశ్ర‌మ వ్య‌వ‌స్థాప‌కుడు గ‌ట్టు శంక‌ర్ శంకుస్థాప‌న చేశారు. ఐదు భ‌వ‌నాల నిర్మాణానికి శంకుస్థాప‌న చేశామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌హిళ‌లు, పురుషుల‌కు వేర్వేరుగా హాస్పిట‌ల్ శివాల‌యం అన్న‌దాన స‌త్రాలు నిర్మిస్తామ‌ని తెలిపారు. దాత‌లు త‌గినంత సాయం చేసి దాతృత్వం చాటుకోవాల‌ని కోరారు.

Also Read :  టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ నాకే.. ప‌ట్నం మహేంద‌ర్‌రెడ్డి ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు

Visitors Are Also Reading