Home » టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ నాకే.. ప‌ట్నం మహేంద‌ర్‌రెడ్డి ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు

టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్ నాకే.. ప‌ట్నం మహేంద‌ర్‌రెడ్డి ఆస‌క్తిక‌ర‌వ్యాఖ్య‌లు

by Anji
Ad

టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత, మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను తాండూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. పార్టీ నాకే టికెట్ ఇస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. అంతేకాదు తాండూరు మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ తాటికొండ స్వ‌ప్న ఐదేళ్లు ప‌ద‌వీలో ఉంటార‌ని నాలుగేళ్ల త‌రువాత అవిశ్వాసం పెట్టినా గెలుస్తామ‌ని ధీమా వ్య‌క్తం చేసారు. మెజార్టీ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్లు నాతోనే ఉన్నార‌ని ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

మ‌రొక వైపు ప్ర‌స్తుత ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వెంట ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్ నేత‌లు నాతో ట‌చ్‌లో ఉన్నార‌ని పేర్కొన్నారు. మ‌హేంద‌ర్‌రెడ్డి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు నా వెంట రావ‌డానికి వారు సిద్ధంగా ఉన్నారంటూ ఈ ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

Advertisement


గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాండూరు నుంచి బ‌రిలోకి దిగిన ప‌ట్నం మ‌హేంద‌ర్‌రెడ్డి ఓడిపోయారు. ఆయ‌న‌పై గెలిచిన కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేసిన పైల‌ట్ రోహిత్‌రెడ్డి విజ‌యం సాధించారు. ఆ త‌రువాత ఆయ‌న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మ‌ళ్లీ నేను తాండూరు నుంచే పోటీ చేస్తాను. టికెట్ నాకు వ‌స్తుంద‌ని వ్యాఖ్యానించి కాక రేపారు మ‌హేంద‌ర్‌రెడ్డి. ఇప్ప‌టికే మ‌హేంద‌ర్‌రెడ్డి రోహిత్‌రెడ్డి వ‌ర్గాల మ‌ధ్య వ‌ర్గ‌పోరు కూడా కొన్ని సార్లు బ‌హిర్గ‌తం అయిన విష‌యం తెలిసిన‌దే. అయితే ఇప్పుడు మ‌హేంద‌ర్ చేసిన వ్యాఖ్య‌లు ఎటువైపు దారితీస్తాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Also Read :  బ్ర‌ద‌ర్ అనిల్ రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారా..? ఆ వ్యాఖ్య‌ల వెన‌క అస‌లు అర్థం ఏంటి..!

Visitors Are Also Reading