Home » పంత్ సెంచరీకి నేనే కారణం అంటున్న యువీ…!

పంత్ సెంచరీకి నేనే కారణం అంటున్న యువీ…!

by Azhar

భారత జట్టుకి ధోని తర్వాత అన్ని ఫార్మట్స్ లో ప్రధాన వికెట్ కీపర్ గా ఇప్పుడు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు రిషబ్ పంత్. అయితే టీం ఇండియాలోకి ధోని వారసుడు అనే పేరుతో రావడం వల్ల.. పంత్ పైన ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అభిమానులు. కానీ అవి పంత్ రిచ్ కాలేకపోయాడు. అందువల్ల అతనిపైన విమర్శలు అనేవి ఎక్కువగా రావడం ప్రారంభమయ్యాయి. ఫాస్ట్ గా ఆడాలి అనే తొందరలో అనవసరపు షాట్స్ ఆడి పంత్ పెవిలియన్ చేరేవాడు. అలా వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా ఇలా చాలా మ్యాచ్ లలో పంత్ విఫలమయ్యాడు. అందువల్ల అతడిని జట్టునుండి తీసేయాలని చాలామంది అన్నారు.

ఆస్ట్రేలియాలో 2020 టెస్ట్ సిరీస్ తర్వాత పంత్ కు ప్రశంసలు దక్కినా… అది కేవలం టెస్టుల వరకే పరిమితం అయ్యాయి. కానీ నిన్న ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ తర్వాత అందరూ పంత్ పైన ప్రశంసలు అనేవి అందరూ కురిపిస్తున్నారు. నిన్న జరిగిన ఈ మ్యాచ్ లో పంత్ వరుస వికెట్లు పడిన తర్వాత జట్టులోకి వచ్చి.. తన దూకుడుని కొంచెం తగ్గించి.. మెల్లిగా ఆడుతూ పాండ్యతో కలిసి చక్కని భాగసౌమ్యం అనేది నెలకొల్పాడు. అలాగే అద్భుతమైన సెంచరీ చేసి.. ఇంగ్లాండ్ లో సెంచరీ చేసిన మొదటి భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. అయితే పంత్ చేసిన ఈ సెంచరీ క్రెడిట్ యువరాజ్ కొట్టేసాడు.

ఈ మ్యాచ్ అనంతరం యువరాజ్ సింగ్ తన ట్విట్టర్ లో.. నీతో నేను మాట్లాడిన ఆ 45 నిమిషాల మాటలు అనేవి పని చేసాయి పంత్. ఈ విధంగానే నువ్వు ని ఇన్నింగ్స్ నిలబెట్టుకోవాలి. ఇక పాండ్య కూడా అద్భుతంగా ఆడాడు అంటూ పోస్ట్ చేసాడు. అయితే యువీ కేవలం పంత్ కు మాత్రమే కాకుండా యువ ఆటగాళ్లకు చాలామందికి తోడుగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాణిస్తున్న అన్‌మోల్ ప్రీత్ సింగ్, అభిషేక్ శర్మ అలాగే టీం ఇండియా టెస్ట్ ఓపెనర్ అయిన శుబ్‌మన్ గిల్ కు మెంటర్ గా ఉంటున్నాడు. వారికి తన స్థాయిలో సహాయం చేస్తూ టిప్స్ ఇస్తూ ఉంటాడు యువీ.

ఇవి కూడా చదవండి :

గురువుకి వైన్ దక్షిణ ఇచ్చిన పంత్..!

పంత్ అనవసరంగా ఆ పని చేసాడు అంటున్న సెహ్వాగ్…!

Visitors Are Also Reading