Home » ‘వాలెంటైన్స్ డే కి ఇచ్చట అద్దెకు బాయ్ ఫ్రెండ్ లభించును’ 

‘వాలెంటైన్స్ డే కి ఇచ్చట అద్దెకు బాయ్ ఫ్రెండ్ లభించును’ 

by Anji
Ad

వాలంటైన్స్ డే కి ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈరోజు వాలంటైన్స్ డే రోజు జంటలు ఒకరినొకరు ఐలవ్ యూ అంటూ తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. అయితే సింగిల్స్ బోర్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మా డేటింగ్ సేవలు వినియోగించుకోండంటూ.. హర్యాణాలోని గురుగ్రామ్ కి చెందిన షకూల్ గుప్త (31) అనే టెకీ వినూతనంగా ప్రచారం చేస్తున్నాడు. ఈ వాలంటైన్స్ డే రోజు పాట్నర్ కోసం వెదికే యువతులకు సరసమైన ధరలకు అద్దెకు బాయ్ ప్రెండ్ ని అందిస్తామని ఓ పోస్టర్ ప్రస్తుతం హల్ చల్ అవుతోంది.

Advertisement

తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోన్లీ నెస్ తో ఫీల్ అవుతున్న వారికి స్నేహితుడిగా ఆపన్నహస్తం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అయితే అందుకు కొంత మొత్తంలో ఛార్జీ వసూలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇలా డేటింగ్ సర్వీస్ లు తొలిసారిగా అందించడం లేదని.. గత ఐదేళ్ల నుంచి మహిళలకు డేటింగ్ సేవలందిస్తున్నామని.. ఇప్పటివరకు 50 మందికి పైగా యువతులతో డేటింగ్ కి వెళ్లినట్టు తెలిపాడు. అయితే దీని వల్ల తాను గతంలో ట్రోల్స్ కి గురైనట్టు పేర్కొన్నాడు. 

Advertisement

Also Read :  హైదరాబాద్ ప్రజలకు ఫుల్ సేఫ్టీ…నగరంలో కొత్తగా 20 కొత్త పోలీస్ స్టేషన్లు

Manam News

అందరూ గిగోలో అంటూ ట్రోల్ చేస్తున్నారు. కానీ నేను దానిని చూసే విధానం వేరే. నా డేటింగ్ ఎప్పుడూ ప్రేమను పంచుతూనే ఉంటుంది. అది విలువ కట్టలేనిది. మీరు లోన్లీగా ఫీల్ అయితే ఏమాత్రం సంకోచించకుండా మీ ఒంటరి తనం దూరం చేసుకోవడానికి నా సేవలు వినియోగించుకోండి అంటూ రాసుకొచ్చాడు. వాస్తవానికి తన జీవితంలో ఎదురైనటువంటి అనుభవం నుంచి ఈ అద్దెకు బాయ్ ఫ్రెండ్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చినట్టు షాకుల్ గుప్త తెలిపాడు. తమకు ఓ గర్ల్ ఫ్రెండ్ / బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండునని ఒంటరి యువత భావిస్తుందని.. ఆ సమయంలో వారిని ఒంటరితనం వేధిస్తుందని.. తాను కూడా గతంలో బాదపడ్డానని షాకుల్ తెలిపాడు. ఎవరైనా సరే బుక్ చేసుకోవచ్చని తెలిపాడు. 

Also Read :   సైలెంట్ గా రకుల్ ప్రీత్ పెళ్లి.. ప్రియుడే వరుడా..? 

Visitors Are Also Reading