సాధారణంగా మన ఆరోగ్యాన్ని కాపాడడంలో నిత్యం వినియోగించే కూరగాయలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూరగాయలు మన శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి.. మనకు పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చుతాయి. మనం నిత్యం తీసుకునే కూరగాయల్లో టమోటా ఒకటి. దాదాపుగా అన్ని ప్రాంతాల వారు కూడా టమోటాలను తింటుంటారు. వీటితో చేసే పలు వంటకాల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టమాటాలతో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అంతేకాదు.. శరీరానికి ప్రోటీన్లు, కార్బో హైడ్రేట్, సహజ చక్కర, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, ఐరన్, ఫాస్పరస్, విటమిన్ ఏ, ఈ, సీ, బీ6 వంటి పోషకాలు టమాల నుంచి అధికంగా లభిస్తాయి. కేవలం టమాటాల ద్వారానే కాకుండా ఎండిపోయినటువంటి టమోటాల ద్వారా కూడా పలు రకాల ప్రయోజనాలున్నాయి.
Advertisement
Advertisement
ఎండిన టమాటాలలో విటమిన్ సి, కే, నియాసిన్, కాపర్, ప్రోటీన్, మాంగనీస్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. మన డైట్ లో డ్రై టమాటాలు చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచివి. డ్రై టమాటాలలో చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై టమాటాలలో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తీవ్రమైన ఇన్ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తుంది. వీటి కారణంగా న్యూమెనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ముప్పు తగ్గుతుంది. ఇమ్యూనిటి తక్కువగా ఉన్నవారు విటమిన్ సి తీసుకోవడం చాలా ఉత్తమం. టమాటాలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. రోగ నిరోధక వ్యవస్థ పని తీరును మెరుగుపరుచుతుంది.
Also Read : ఈ అలవాట్లు మానుకుంటే మీ బెల్లీ ఫ్యాట్ కరగడం పక్కా..!
అదేవిధంగా బీపీ కారణంగా గుండె సమస్యలు, కిడ్నీ సంబంధిత వ్యాధులను డ్రై టమాటాలు తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతాయి. టమాటాలలో పొటాషియం అధికంగా ఉండడం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. డ్రై టమాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే కాల్షియం ఎముకలు దృఢంగా ఉండేందుకు సహాయపడుతుంది. గుండె కండరాలను కూడా బలపరుస్తాయి. ఎండిన టమాటాలు మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇక ఇంకెందుకు ఆలస్యం ఎండిన టమాటాలను తీసుకొని వాటి ప్రయోజనాలను పొందండి.