Home » ఈ అలవాట్లు మానుకుంటే మీ బెల్లీ ఫ్యాట్ కరగడం పక్కా..!

ఈ అలవాట్లు మానుకుంటే మీ బెల్లీ ఫ్యాట్ కరగడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా శరీరం యొక్క బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. ప్రధానంగా కొంతమందిలో శరీరం యొక్క బరువు జీన్స్ కారణంగానే పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం చాలా మంది శరీర బరువు కారణంగా అందహీనంగా కనిపిస్తున్నారు. ఇక ఈ సమస్యకి చెక్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా ఈ 5 అలవాట్లు ఉండడం వల్లే ఎక్కువ శరీరం బరువు పెరుగుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ అలవాట్లు ఏంటో ఇఫ్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

  • తరచుగా ఆయిల్ ఫుడ్స్ ని  ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు. దీంతో శరీరంలో చెడు కొలెస్ట్రాల్ సమస్యల బారిన పడి బరువు పెరుగుతుంటారు. ఈ కొలెస్ట్రాల్ ని నియంత్రించుకోవడం ఉత్తమం. లేకుంటే ప్రమాదం పొంచి ఉందనే చెప్పాలి. చెడు కొలెస్ట్రాల్ వల్ల రకరకాల వ్యాధులు సంభవించే అవకాశముంది.

Also Read :   వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు.. మధుమేహం కూడా అదుపులో ఉంటుంది..!

Advertisement

  • చాలా మంది టిఫిన్, లంచ్, డిన్నర్ చేసిన తరువాత నడవకుండా అలాగే కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీంతో పొట్ట పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు వస్తున్నాయి.

Manam News

  • కొంత మంది నిత్యం స్వీట్ వస్తువులను తింటుంటారు. వీటి వల్ల కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలో పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. తీపి పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కొందరిలో అయితే రక్తంలో చక్కర పరిమాణాలు పెరిగే అవకాశముంది. బరువు తగ్గే క్రమంలో వీటిని ఎక్కువగా తినకపోవడం ఉత్తమం. 

 

  • సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా శరీరం బరువు పెరుగుతారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. బరువు పెరిగే కారణాలు నిద్ర లేకపోవడం కూడా ఓ కారణం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రపోవాల్సి వస్తుంది. 

Also Read :  వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు.. మధుమేహం కూడా అదుపులో ఉంటుంది..!

Visitors Are Also Reading