Home »  కీర్తి సురేష్ ఏడాదికి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

 కీర్తి సురేష్ ఏడాదికి ఎంత సంపాదిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈమె ఇటీవలే తెలుగులో నేచురల్ స్టార్ నానికి జంటగా దసరా సినిమాలో నటించారు. భారీ అంచనాల మధ్య మార్చి 30న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. నాని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకుంది. అంతేకాదు.. ఓవర్సిస్ ప్రీమియర్స్ తోనే ఈ సినిమా 2 మిలియన్ డాలర్స్ అందుకొని నాని కెరీర్ లో ఓ రికార్డునే క్రియేట్ చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.  

Also Read :  Samantha : ఆక్సిజన్ మాస్క్ తో సమంత…అత్యంత క్రిటికల్ గా పరిస్థితి ?

Advertisement

Advertisement

ప్రస్తుతం కీర్తి సురేష్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈమె ఆస్తులు, రెమ్యునరేషన్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు ఆమె నికర ఆస్తుల విలువ రూ.22 కోట్లు వరకు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఆమె ఒక్కో సినిమాకి ఫీజు 2.5 నుంచి రూ.3కోట్ల వరకు ఉంటుందని సమాచారం. సెలెబ్రిటీల ఆస్తుల గురించి రాసే ఓ వెబ్ సైట్ ప్రకారం.. ఆమె ఏడాదికి 4 నుంచి రూ.6కోట్ల రేంజ్లో సంపాదిస్తుందని తెలుస్తోంది. 

Keerthi Suresh

మరోవైపు కీర్తి సురేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం. ఏ హీరోయిన్ పెళ్లి గురించి అయినా రూమర్స్ వినిపించడం సర్వసాధరణం. కీర్తి సురేష్ వార్త హల్ చల్ అవుతోంది. తల్లిదండ్రులు నిశ్చయించిన వరుడితోనే ఏడు అడుగులు వేయడానికి ఓకే చెప్పారని.. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందని పేర్కొంటున్నారు. కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి వ్యాపారవేత్త అని, తమిళ రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొంటున్నట్టు సమాచారం.  

Also Read :  బొంబాయి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ హీరో ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading