Home » నాటుకోడి పులుసు రాగి సంగటి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవడం పక్కా..!

నాటుకోడి పులుసు రాగి సంగటి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా రాయలసీమ ప్రాంతంలో చాలా ఫేమస్ వంటకం ఇది. ప్రస్తుతం ఇప్పుడు అన్ని ఏరియాల్లో లభిస్తుంది. పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా తమ మెనులో దీనిని చేర్చారు. కేవలం రుచి పరంగానే కాదు.. నాటు కోడి పులుసు రాగి సంగటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రుచిలో, పోషకాల్లో నాటుకోడి మాంసానికి మరొకటి సాటిలేదు. నాటుకోడి ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఫైబర్, ప్రోటీన్ తో సహా చాలా రకాల పోషకాలు నాటుకోడి లో ఉంటాయి.చికెన్, మటన్, సీ ఫుడ్ కంటే నాటుకోడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ధ‌ర కూడా కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది.అయినా సరే నాటుకోడిని ఓ ప‌ట్టు ప‌ట్టాల్సిందే. ఏ వ‌య‌సు వారైనా నాటుకోడిని నిశ్చింతగా తినవచ్చు. 

Advertisement

Advertisement

ప్రధానంగా రాగి సంకటితో నాటుకోడి పులుసు తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఎముకలు, కండరాలు పుష్టిగా మారతాయి. కీళ్లనొప్పులు, వాపులు వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.  అలాగే రాగి సంగటి తో నాటు కోడి పులుసును తింటే ఒత్తిడి దూరం అవుతుంది.మధుమేహం వ్యాధి గ్రస్తులకు కూడా రాగి సంగటి నాటుకోడి పులుసు ఎంతో మేలు చేస్తాయి. వారానికి ఒక్కసారి అయినా మధుమేహం ఉన్న వారు ఈ రెండిటిని తీసుకుంటే రక్తంలో చక్కెత‌ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

అంతేకాదు నాటుకోడి పులుసు రాగి సంగటి తినడం వల్ల వాటిలో ఉండే ఐర‌న్‌ రక్తహీనతను త‌రిమికొడుతుంది.ఫైబ‌ర్ జీర్ణవ్యవస్థ పనితీరును  చాలా మెరుగుప‌రుస్తుంది. ప్రోటీన్ కొరత తలెత్తకుండా సైతం ఉంటుంది. అయితే మంచిది కదా అని రోజు అదే పని మీద ఉండకండి. అతిగా తీసుకుంటే అమృత‌మైనా విష‌మే అవుతుంది. కాబ‌ట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్ర‌మే నాటుకోడి పులుసు రాగి సంగటి తీసుకోవడం ఉత్తమం. కానీ కొంతమందికి ఇంకా ఆ కాంబినేషన్ గురించి తెలియదు. ఇంకెందుకు ఆలస్యం నాటుకోడి-రాగిసంకటి తినేయ్యండి.   

Visitors Are Also Reading