Home » Jammi Chettu: జమ్మి చెట్టుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Jammi Chettu: జమ్మి చెట్టుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Published: Last Updated on
Ad

సాధారణంగా ఈ భూమి మీద ఉండే చెట్లు మనకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూనే ఉంటాయి.అయితే అందులో కొన్ని రకాల చెట్లు మనం పూజలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అలా మనం పూజించే చెట్లలో జమ్మిచెట్టు కూడా ఒకటి. శ్రీరాముడు రావణాసురుడిపై యుద్ధానికి వెళ్లే ముందు జమ్మి చెట్టుకు పూజ చేసి వెళ్లి విజయం సాధించారని పేర్కొంటారు. కాబట్టి విజయదశమి రోజు ఈ చెట్టుకి ప్రత్యేక పూజలు చేస్తారు. అంతేకాదు..  అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు వారి ఆయుధాలను జమ్మి చెట్టు మీద ఉంచి, తాము వచ్చేవరకు ఆయుధాలను కాపాడమని ఆ చెట్టుకు మొక్కి వెళ్తారు.

Advertisement

ఇక అ ముగిసిన తర్వాత విజయదశమి రోజున  చెట్టు మీద నుంచి ఆయుధాలను తీసుకొని కౌరవుల పై యుద్ధం చేసి పాండవులు  విజయం సాధిస్తారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు విజయదశమి రోజున జమ్మి చెట్టుకు మనం పూజలు చేస్తూనే ఉన్నాం. జమ్మి చెట్టుకు పూజలు చేయడం వల్ల పనుల్లో విజయం చేకూరుతుంది. అయితే జమ్మి చెట్టుతో కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో జమ్మి చెట్టును అనారోగ్య సమస్యలను తగ్గించే ఒక ఔషధంగా  ఉపయోగిస్తారు. ఈ చెట్టు చాలా రకాల  ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఈ చెట్టు గాలిని పీల్చడం వల్ల ఎన్నో రోగాలు నయం అవుతాయట.

Advertisement

అలాగే ఈ జమ్మి ఆకుల పసరును లేపనంగా రాయడం వలన కుష్టు వ్యాధి కూడా నయం అవుతుంది. జమ్మి ఆకులను, జమ్మి చెట్టు బెరడును, మిరియాలను కలిపి మెత్తగా నూరి మాత్రలుగా చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇక ఈ మాత్రలను మజ్జిగతో కలిపి తీసుకోవడం వల్ల అతిసారం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాదు.. అవాంఛిత రోమాల కూడా  తొలగిపోతాయి. అలాగే జమ్మి ఆకులను కాల్చగా వచ్చిన పొగను పిలిస్తే అవి తగ్గిపోతాయి. జమ్మి చెట్టు యొక్క బెరడును నూరగా వచ్చిన గంధాన్ని విష కీలకాలు కుట్టిన చోట రాయడం వల్ల విష ప్రభావం తగ్గుతుంది. 

మరికొన్ని తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి

 

Visitors Are Also Reading