Home » దూత కోసం నాగచైతన్య ఎంత డిమాండ్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!

దూత కోసం నాగచైతన్య ఎంత డిమాండ్ చేశాడో తెలిస్తే షాక్ అవుతారు..!

by Anji
Ad

అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ప్రస్తుతం సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే డిజిటల్ ప్లాట్ ఫామ్ ను నమ్ముకున్నారు. తాజాగా దూత అనే వెబ్ మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఈ వెబ్ మూవీ కోసం నాగచైతన్య ఎంత పారితోషికం తీసుకోబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే నాగచైతన్య తన తాత, తండ్రిలాగా టాప్ హీరోగా మారలేకపోయాడు. కానీ, టైర్ 2 హీరోలా లిస్టులోకి ఉండిపోయారు. ఇక ఎంత ప్రయత్నం చేసినా సరే.. కేవలం  హిట్ అయితే పడుతోంది. కానీ స్టార్ హీరో మాత్రం కాలేకపోతున్నారు నాగచైతన్య.

Advertisement

ఇకపోతే స్టార్ హీరోగా అవ్వకపోయినా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుత హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్నారు. గతంలో బంగార్రాజు, లవ్ స్టోరీ వంటి సినిమాలతో భారీ విజయాన్ని అందుకున్నాడు. కానీ, ఆ తర్వాత నటించిన కస్టడీ సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. ఇక అందుకే డిజిటల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు నాగచైతన్య. ఇదిలా ఉండగా గతంలో దర్శకుడు కే.విక్రం దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ మొదలుపెట్టగా తాజాగాది కంప్లీట్ అయింది. స్ట్రీమింగ్ కి కూడా సిద్ధమవుతోంది.

Advertisement

ఇదిలా ఉండగా ఈ వెబ్ మూవీ స్టార్ట్ అయ్యి చాలాకాలం అవుతున్న కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ దూత వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయబోతున్నారు. డిసెంబరు ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వగా థ్రిల్లింగ్, యాక్షన్ సన్నివేశాలను ఇందులో చాలానే ఉంచినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేస్తున్నారు. ఇకపోతే సినిమాల ద్వారా సరైన సక్సెస్ లేకపోయినా ఈ వెబ్ మూవీ కోసం ఆయన భారీగా డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ వెబ్ మూవీకి గాను నాగచైతన్య 8 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. సాధారణంగా ఒక్కో సినిమాకి రూ.15 కోట్ల వరకు తీసుకునే నాగచైతన్య ఈ వెబ్ మూవీకి మాత్రం రూ.8 కోట్లు అందుకుంటున్నాడని సమాచారం.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading