టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే మిస్డ్‌కాల్ ఇస్తే పన్ను మినహాయింపులు చేస్తాం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అదేవిధంగా ఇది ఎన్నికల నియమావళికి కూడ విరుద్ధం అని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఆయన స్పందించారు.
Advertisement
Ad
Advertisement
జనం తమను తరిమేశారన్న ఉక్రోషంతో ఎవర్నీకూడ రోడ్లపై తిరగనివ్వం అని, తరిమికొడతామని లోకేష్ అసభ్య పదజాలంతో వీరంగం సృష్టిస్తున్నాడని పేర్కొన్నారు. గతంలో తానేసిన రోడ్లపై నడుస్తున్నారని ఓటు వేయకపోతే తాట తీస్తానని జనాన్ని చంద్రబాబు బెదిరించినట్టు గుర్తు చేశారు. మంత్రాలకు చింతకాయలు రాలవని, బెదిరిస్తే ఓట్లు రావు బాబు అని ట్విట్టర్‌లో వెల్లడించారు విజయసాయిరెడ్డి. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నాయకులు తరుచూ వివాదస్పద వ్యాఖ్యలు చేసుకోవడం సంచలనంగా మారుతోంది.