Home » మాస్ పాట‌కు ఊర మాస్ డ్యాన్‌తో దుమ్ము రేపిన ఎమ్మెల్యే

మాస్ పాట‌కు ఊర మాస్ డ్యాన్‌తో దుమ్ము రేపిన ఎమ్మెల్యే

by Anji
Ad

టాలీవుడ్ సినిమా పలాస 1978 సినిమాలోని నాది న‌క్కిలిసు గొలుసు అనే పాట తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్‌లో ఫేమ‌స్ అయిందో అంద‌రికీ తెలిసిన‌దే. ఏ ఫంక్ష‌న్ అయినా ఆ పాట ఉండాల్సింది అన్న‌ట్టుగా మారిపోయింది. ఈ పాట‌కు యావ‌త్ యువ‌తే కాదు.. చిన్న పెద్ద అంతా ఊగిపోయారు ఆ పాట వినిపిస్తే.. ఆటోమాటిక్ గా కాళ్లు, చేతులు క‌దిలిపోతుంటాయి. ఆ రేంజ్‌లో జ‌నాల‌ను ఆక‌ట్టుకుంది పాట‌. అయితే తాజాగా ఇదే పాట‌కు ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఓ రేంజ్‌లో డ్యాన్స్ వేశారు. ప‌ద ప‌దానికి, పాదం క‌దుపుతూ.. ట్యూన్‌కు త‌గ్గ‌ట్టుగా స్టెప్పులు వేస్తూ దుమ్ము రేపారు.

Advertisement

పూత‌ల ప‌ట్టు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, వైసీపీ నేత పై మాఘం సుగుణాక‌ర్ రెడ్డి జ‌న్మ‌దిన వేడుక‌ల్లో వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పాల్గొన్నారు. చెన్నైలోని ఒక హోట‌ల్లో జ‌రిగిన ఈ బ‌ర్త్ డే వేడుక‌ల్లో డీజే కూడా ఏర్పాట్లు చేసారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పార్టీ కార్య‌క‌ర్త‌లు అనుచ‌రుల‌తో డ్యాన్స్ వేశారు. నాది న‌క్కిలీసు గొలుసు పాట వేయ‌గా.. అదిరిపోయే మాస్ స్టెప్పుల‌తో అల‌రించారు. ఎమ్మెల్యే బాబు, పాట‌కు అనుగుణంగా డ్యాన్స్ చేస్తూ దుమ్ము రేపారు. కాగా.. ఎమ్మెల్యే డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. ఎమ్మెల్యే డ్యాన్స్‌కు ఆయ‌న అభిమానులు, వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఫిదా అయిపోతున్నారు. త‌గ్గేదేలే ఎమ్మెల్యే గారూ.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం ఎమ్మెల్యే డ్యాన్స్‌ను మీరు చూడండి.

Advertisement

Also Read :  అన్నయ్య చిరంజీవి పెళ్లి చేసుకోవడంతో బాధపడిన పవన్ కళ్యాణ్….ఎందుకో తెలుసా…!

Visitors Are Also Reading