Home » ప్రభాస్ దారిలోనే యశ్… సక్సెస్ అవుతాడా..?

ప్రభాస్ దారిలోనే యశ్… సక్సెస్ అవుతాడా..?

by Azhar
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ను ఒక్కేసారి మార్చేసింది బాహుబలి. 2016 లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత మరో సినిమా చేయకుండా బాహుబలి 2 లో నటించాడు ప్రభాస్. ఇక ఈ సినిమా నైతే మొత్తం ఇండియా వ్యాప్తంగా ఓ ట్రెండ్ అనేది సెట్ చేసింది. ఇక దాంతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ పై చాలా మంది దృష్టి అనేది పడింది. కానీ ఈ సినిమా తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్ వంటి రెండు సినిమాలు కూడా దారుణంగా విఫలమయ్యాయి. అయితే ప్రభాస్ మధురోగానే ఒక్కే సినిమాతో సూపర్ స్టార్ అయిన హీరో యశ్.

Advertisement

యశ్ హీరోగా వచ్చిన కేజిఎఫ్ మొదటి భాగం జనాలను బాగా ఆకట్టుకోవడం వల్ల.. రెండో భాగం పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ మధ్యే జనం ముందుకు వచ్చిన ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ అనేది క్రాస్ చేసి ముందుకు వెళ్ళిపోతుంది. అందువల్ల యశ్ తర్వాత చేయబోయే సినిమాల గురించి ఫ్యాన్స్ బాగా వేచి చూస్తున్నారు. కానీ ఇప్పుడు యశ్ కూడా ప్రభాస్ చేసిన విధంగానే చేయబోతున్నట్లు తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ స్టోరీ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు. అలాగే స్టార్ డైరెక్టర్స్ తో కాకుండా యువ దర్శకులతో సినిమాలు చేసాడు. అంది కాస్త రివర్స్ అయ్యింది.

Advertisement

ఇక ఇప్పుడు యశ్ కూడా ప్రభాస్ దారిలోనే యువ హీరోలతో సినిమాలు చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే దర్శకులు ఎవరైనా కానీ.. స్టోరీ విషయంలో మాత్రం ప్రభాస్ చేసిన తప్పులు చేయకుండా యశ్.. తన రేంజ్ కు తగ్గిన కథను ఎంచుకోవాలని అంటున్నారు. ప్రస్తుతం యశ్ రేంజ్ ను హ్యాండిల్ చేసే దర్శకులు ఎవరు కన్నడ ఇండస్ట్రీలో లేకపోవడంతోనే యువ డైరెక్టర్లతో యశ్ సినిమా చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఇలా వెళ్లే బొక్కబోర్లా పడిన ప్రభాస్.. మాదిరి యశ్ కూడా ప్లాప్ అవుతాడా… లేక సక్సెస్ అవుతాడా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

పుజారాల ఆడేవాడు పంత్ మాదిరి ఆడాడు..!

కోహ్లీతో గొడవపై షాకింగ్ కామెంట్స్ చేసిన బెయిర్ స్టో..!

Visitors Are Also Reading