Telugu News » Blog » కోహ్లీతో గొడవపై షాకింగ్ కామెంట్స్ చేసిన బెయిర్ స్టో..!

కోహ్లీతో గొడవపై షాకింగ్ కామెంట్స్ చేసిన బెయిర్ స్టో..!

by Manohar Reddy Mano
Ads

టీం ఇండియా మాజీ కెప్టెన్ కోహ్లీ పేరు నిన్న పెద్ద చర్చగా మారింది. అందుకు కారణం అతని పేలవ ఫామ్ కాదు. మ్యాచ్ లో అతను చేసిన పని. అయితే ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీం ఇండియా అక్కడి జట్టుతో గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన 5వ టెస్ట్ మ్యాచ్ అనేది ఆడుతుంది. ఇక నిన్న ఈ మ్యాచ్ మూడవ రోజు.. ఇంగ్లాండ్ జట్టు బ్యాటర్ జానీ బెయిర్ స్టో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో కోహ్లీ అతడిని కవ్వించాడు. ఆ తర్వాత దానికి బెయిర్ స్టో సమాధానం ఇవ్వడంతో వీరి మధ్య వాగ్వాదం అనేది నడిచింది.

Ads

దాంతో మ్యాచ్ మధ్యలో అంపైర్ అలాగే నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న ఇంగ్లాంను కెప్టెన్ బెన్ స్టోక్స్ కలుగుకాజేసుకొని ఇద్దరిని శాంతిపజేశారు. అందువల్ల వీరిద్దరూ నిన్న ట్రెండ్ లో నిలిచారు. కానీ నిన్న మ్యాచ్ సమయం ముగిసిన తర్వాత బెయిర్ స్టో మాట్లాడుతూ.. కోహ్లీతో గొడవ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. బెయిర్ స్టో అలా మాట్లాడుతాడు అని ఎవరు ఉహించి ఉండరు. అయితే మ్యాచ్ అనంతరం బెయిర్ స్టో మాట్లాడుతూ… మొదటి విషయం ఏంటంటే నాకు కోహ్లీకి ఎటువంటి గొడవలు లేవు. కోహ్లీ క్రికెట్ ను చాలా ప్రేమిస్తాడు. అదే అతను ఈ రోజు ఇలా ఉండటానికి కారణం అయ్యింది.

Ads

ఇక కోహ్లీ లాంటి ఆటగాడికి ప్రత్యర్థిగా క్రీజులో ఉండటం అనేది నా అదృష్టం అనే నేను అనుకుంటున్నాను. ఇక మేము ఇద్దరం ఎప్పుడు ఒక్కరినొకరిని గౌరవించుకుంటాం. అయితే ఏ ఆటగాడు అయినా… జట్టు అయినా తమ దేశం కోసమే ఆడుతుంది. అందులో విజయం సాధించి తన దేశానికి గౌరవం తీసుకురావాలని చూస్తారు. ఇక మా మధ్యలో కూడా ఆదే జరిగింది. అయితే ప్రతి సిరీస్ సిరీస్ కు టీం ఇండియా ఆటగాళ్లు ఇంకా బాగా అడవుతున్నారు. అందుకే ఆ జట్టుకు వ్యతిరేకంగా ఆడటం అనేది ఎప్పటికి ఓ కష్టమైనా సవాల్ అని చెప్పాలి అంటూ బెయిర్ స్టో పేర్కొన్నాడు.

Ad

ఇవి కూడా చదవండి :

ఐసొలేషన్ నుండి రోహిత్ కు విముక్తి..!

ఐపీఎల్ వైఫల్యం పై జడేజా షాకింగ్ కామెంట్స్…!