Home » “రైటర్ పద్మభూషణ్” ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే !

“రైటర్ పద్మభూషణ్” ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే !

by Bunty
Ad

 

ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలుస్తున్న చిత్రాలు చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అందుకున్న చిత్రం రైటర్ పద్మభూషణ్ ఒకటి. అయితే, ఈ “రైటర్ పద్మభూషణ్”, ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఫిబ్రవరి 3న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే అలరించింది. విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి.

READ ALSO : పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న మంచు మనోజ్… అసలు కారణం ఇదే,?

Advertisement

సుహాస్ సరసన టీనా శిల్పరాజ్ హీరోయిన్ గా నటించింది. రైటర్ పద్మభూషణ్ మూవీ ఓటిటి రైట్ జి5 దక్కించుకుంది. మార్చి 17వ తేదీ నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవ్వనుంది.ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించారు. సినిమాలో సుహాస్ తల్లిదండ్రులుగా ఆశిష్ విద్యార్థి, రోహిణి నటించారు. రచయిత కావాలని ఆరాటపడే పద్మభూషణ్ అనే యువకుడిగా సుహాస్ నేచురల్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. తొలి అడుగు పేరుతో ఓన్ గా బుక్ రాస్తాడు పద్మభూషణ్.

Advertisement

READ ALSO : అన్న కొడుకు కోసం బాలయ్య తపన.. కృతజ్ఞతలు తెలిపిన విజయసాయిరెడ్డి

కానీ ఆ బుక్ సక్సెస్ కాదు. అదే టైంలో అతడి పేరుతో మరో పుస్తకం విడుదలై విజయవంతం అవుతుంది. అతని పేరుతో ఏర్పాటైన బ్లాగ్ కు కూడా జనాల్లో మంచి పాపులాటి వస్తుంది. మరదలితో వివాహంతో పాటు నేమ్ అండ్ ఫేమ్ కోసం ఆ పుస్తకాన్ని రాసింది తానే అని అబద్ధం చెప్పుకు తిరుగుతాడు పద్మభూషణ్. ఆ అబద్ధం కారణంగా అతడు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు అనే సందర్భాలను వినోదాత్మక పంతా లో షణ్ముఖ ప్రశాంత్ ఈ సినిమా లో ఆవిష్కరించారు.

READ ALSO : Ravanasura : రావణాసుర టీజర్ రిలీజ్… అరివీర భయంకరంగా రవితేజ

Visitors Are Also Reading