Home » WPL 2024 : క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

WPL 2024 : క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. డబ్ల్యూపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది

by Anji

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. బెంగళూరు వేదికగా తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. తొలి సీజన్ లో కేవలం ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్ ఈ సారి రెండు నగరాల్లో జరుగనుంది.

ఈ సీజన్ లో మొదటి దశ మ్యాచ్ లు బెంగళూరులో.. రెండో దశ మ్యాచ్ లు ఢిల్లీలో జరుగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 04 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు జరుగనున్నాయి. అనంతరం మార్చి 05 నుంచి మిగిలిన దశ మ్యాచ్ లు ఢిల్లీలో జరుగనున్నాయి. మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరుగనున్నాయి. మొత్తం అన్ని మ్యాచ్ లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. భారత్ లో మహిళల క్రికెట్ ను అభివృద్ధి చేసేందుకు గత ఏడాది డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ కి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. 

WPL 2024 షెడ్యూల్ : 

  • ఫిబ్రవరి 23-ముంబై ఇండియన్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్  (బెంగళూరు)
  • ఫిబ్రవరి 24 – రాయల్ ఛాలెంజ్ బెంగళూరు Vs యూపీ వారియర్స్ (బెంగళూరు)
  • ఫిబ్రవరి 25 – గుజరాత్ జెయింట్స్ Vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు)
  • ఫిబ్రవరి 26 – యూపీ వారియర్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  • ఫిబ్రవరి 27 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు)
  • ఫిబ్రవరి 28 – ముంబై ఇండియన్స్ Vs యూపీ వారియర్స్ (బెంగళూరు)
  • ఫిబ్రవరి 29 – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  • మార్చి 01- యూపీ వారియర్స్ Vs గుజరాత్ జెయింట్స్ (బెంగళూరు)
  • మార్చి 02-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు Vs ముంబై ఇండియన్స్ (బెంగళూరు)
  • మార్చి 03- గుజరాత్ జెయింట్స్ Vs ఢిల్లీ క్యాపిటల్స్ (బెంగళూరు)
  • మార్చి 04- యూపీ వారియర్స్ Vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
  • మార్చి 05-ఢిల్లీ క్యాపిటల్స్ Vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
  • మార్చి06- గుజరాత్ జెయింట్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
  • మార్చి 07 – యూపీ వారియర్స్ Vs ముంబై ఇండియన్స్ (ఢిల్లీ)
  • మార్చి 08- ఢిల్లీ క్యాపిటల్స్ Vs యూపీ వారియర్స్ (ఢిల్లీ)
  • మార్చి 09- ముంబై ఇండియన్స్ Vs గుజరాత్ జెయింట్స్ (ఢిల్లీ)
  • మార్చి 10- ఢిల్లీ క్యాపిటల్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
  • మార్చి 11-గుజరాత్ జెయింట్స్ Vs యూపి వారియర్స్ (ఢిల్లీ)
  • మార్చి 12-ముంబయి ఇండియన్స్ Vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఢిల్లీ)
  • మార్చి 13 – ఢిల్లీ క్యాపిటల్స్ Vs గుజరాత్ జేయింట్స్ (ఢిల్లీ)
  • మార్చి 15- ఎలిమినేటర్ (ఢిల్లీ)
  • మార్చి 17 ఫైనల్ (ఢిల్లీ)

 

Visitors Are Also Reading