ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను వాడకుండా ఉండలేకపోతున్నారు. ఏదో ఒక విదంగా తప్పకుండా సోషల్ మీడియాను వాడుతున్నారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా, ఫేస్బుక్ ఇలా ప్రతి దాంట్లో చాటింగ్‌లు, ఫోటోలు, వీడియోలు షేర్ చేయడంతో పాటు ఎమోజీలను కూడా వాడుతుంటారు. అసలు ఎమోజీ అంటే ఏమిటో ఇప్పటికీ చాలా మందికి తెలియదు. కొంత మంది అయితే ఎమోజీలను వాడుతుంటారు.కానీ అవి ఎమోజీలు అనే విషయం అసలు తెలియకపోవడం గమనార్హం.
Advertisement
ఎమోజీలు ఉంటే అసలు మాట్లాడాల్సిన అవసరమే ఉండదు. ప్రస్తుతం చాలా మంది చాటింగ్ సందర్భంలో మాటల బదులు ఎమోజీలను వాడుతున్నారు. ప్రస్తుం కోపం, బాధ,నవ్వు, ఏడుపు, తినాలనిపించడం, ప్రేమ, సిగ్గుపడడం వంటి సందర్భాల్లో రకరకాల ఎమోజీలను వాడుతున్నారు. మాట్లాడే అవసరం లేకుండా భావోద్వేగాలను వ్యక్తం చేయడంలో ఎమోజీ బాగా పాపులర్ అయింది. 2014 నుంచి ప్రతి సంవత్సరం జులై 17న ప్రపంచ ఎమోజీడే జరుపుకుంటున్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి భాషల్లో ఏ భాష ఎప్పుడో పుట్టిందో ఎవ్వరూ చెప్పలేరు. కానీ ఎమోజీ ఎప్పుడు పుట్టిందో రికార్డుల పరంగా చెప్పవచ్చు. 1999 సంవత్సరంలో తొలుత జపాన్‌లోని ఎన్టీటీ డొకొమొ అనే ఓ సెల్‌ఫోన్ కంపెనీ ప్రాణం పోసింది. వీటిని షెగెటక కురిట అనే వ్యక్తి వీటిని తయారు చేశాడు. మాటలతో సంబంధం లేకుండా భావాలను చెప్పే 176 ఎమోజీలను అందుబాటులోకి తెచ్చాడు.
Advertisement
1982లో ఎమోటికాన్స్ వచ్చాయి. వీటిని స్కాట్ పల్మన్ అనే అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ తయారు చేశాడు. జీమెయిల్, వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటివి అందుబాటులోకి రాకముందు ఎక్కువ మంది యాహూ మెయిల్‌ను ఉపయోగించేవారు. హావ భావాలను తెలిపేందుకు యాహూ ఈ ఎమెజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2010 తరువాత ఈ ఎమోజీలు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి కూడా వచ్చి చేరాయి. 2014లో ఎమోజీలు, వాటి రకాలు, అవి చెప్పే అర్థాల గురించి జెరెమీ బర్గ్ అనే ఎమోజీపిడియా వెబ్ సైట్ పెట్టాడు. ఆయనే జులై 17ను వరల్డ్ ఎమోజీ డే అని చెప్పాడు. ఎమోజీపిడియా ప్రకారం.. మొత్తం 1800లకు పైగా ఎమోజీలు ఉన్నాయి.
వరల్డ్ ఎమోజీ సందర్భంగా అమెరికాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా సంస్థ బంబుల్ ఎమోజీలను ఎక్కువగా వినియోగిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది. 2020 నుంచి 2021 మధ్యకాలలో ముఖ్యంగా కరోనా సమయంలో 86 శాతం పెరిగింది. అందులో భారతీయులు ఎక్కువగా క్లాసిక్ రెడ్ హార్ట్ ఎమోజీని వినియోగిస్తున్నారట. యువతనే ఎక్కువగా ఈ ఎమోజీని వాడుతోందని బంబుల్ సంస్థ వెల్లడించింది. భారత్‌లో టాప్-5 ఎమోజీల విషయానికొస్తే.. రెడ్ హార్ట్, కన్నుగీటేది, కన్నీళ్లతో ఉన్న ఎమోజీ, సన్ గ్లాసెస్ ఎమోజీ, కళ్లతో నవ్వె స్మైల్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
Also Read :
ఆ స్టార్ హీరోయిన్ అన్నతో ఇలియానా లవ్ ఎఫైర్.. సోషల్ మీడియాలో వైరల్..!
రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న బాలయ్య…!