Home » రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న బాలయ్య…!

రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న బాలయ్య…!

by Azhar
Ad

టాలీవుడ్ లో ఇప్పుడు అందరూ హీరోలు పుల్ బిజీగా ఉన్నారు. కరోనా ఇచ్చిన గ్యాప్ తర్వాత ఇప్పుడు ప్రతి చిన్న హీరో నుండి పెద్ద హీరో వరకు అందరి చేతిలో రెండు, మూడు సినిమాలు అనేవి ఉంటున్నాయి. ఇక ఈ లిస్ట్ లో సీనియర్ హీరోలకు కూడా మినహాయింపు అనేది లేదు. ఇప్పుడు టాలీవుడ్ లోని సీనియర్ హీరోలు చిరంజీవి, నాగార్జునతో పాటుగా నందమూరి నటసింహం బాలకృష్ణ కూడా వరుస సినిమాలతో చాలా నీజీగా ఉన్నాడు. అయితే బాలయ్య హీరోగా గత ఏడాది చివర్లో వచ్చిన అఖండ సినిమా అనేది సూపర్ హిట్ సాధించింది.

Advertisement

ఈ సినిమా అనేది బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో హాట్రిక్ హిట్ అనేది అందుకుంది. ఇక ఇప్పుడు బాలయ్య క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా అనేది తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అనేది సెట్స్ పైన ఉంది. ఇక ఇలా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న బాలయ్య రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే లే అంటునట్లు తెలుస్తుంది. ఇప్పుడు కూడా బాగానే బాలయ్య ఒక్కో సినిమాకు అందుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే గోపీచంద్ మలినేనితో సినిమా అనేది పూర్తయిన తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నాడు.

Advertisement

ఇక ఈ సినిమా కోసం బాలయ్య.. ఏకంగా 15 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఎఫ్ 3 వంటి సూపర్ హిట్ సినిమా తర్వాత అనిల్ తీస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్ పైన అప్పుడే భారీ అంచనాలు కూడా పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇక ఈ సినిమాలో పెళ్లి సందడి హీరోయిన్ శ్రీలీల బాలయ్యకు కూతురుగా కనిపించబితుంది అని వార్తలు వస్తున్నాయి. కానీ ఎవరు హీరోయిన్ గా చేస్తారు అనే దానిపై క్లారిటీ రాలేదు. గోపీచంద్ మలినేనితో చేస్తున్న సినిమాలో బాలయ్యతో జంట కట్టిన శృతి హాసన్ నే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా చేయనున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ విషయంలో ఇంకా ఆధికారిక ప్రకటన అనేది రాలేదు.

ఇవి కూడా చదవండి :

ముంబై వదిలేయడంతో షాక్ లోకి పాండ్య..!

బుమ్రా స్థానంలో సిరాజ్ ఎందుకు తుది జట్టులోకి వచ్చాడో తెలుసా..?

Visitors Are Also Reading