సాధారణంగా స్నానం ఉదయం పూటనే చేయాలని మన పెద్దలు చెబుతుంటారు. సూర్యోదయానికి ముందే స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. సంప్రదాయాల ప్రకారం.. కొన్ని వారాల్లో తలస్నానం చేయకూడదు అని చెబుతుంటారు. మరికొన్ని రోజుల్లో కచ్చితంగా తలస్నానం చేయాలని అంటుంటారు. నిజానికి తలస్నానం అందరికీ రోజు చేసే వీలు, వసతి ఉండదు. అలాంటి వారు వారానికి రెండు, మూడు రోజులు తలస్నానం చేస్తారు. ఏ రోజుల్లో తలస్నానం చేయాలి. ఏ రోజుల్లో చేయకూడదు అనే విషయం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పెళ్లి అయిన ఆడవారు ఏయే రోజుల్లో తల స్నానం చేయాలి. ఏయే రోజుల్లో తలస్నానం చేయకూడదు. ఈ విషయం గురించి శాస్త్ర రిత్యా పరిశీలిస్తే వివాహత స్త్రీలు తలంటూ స్నానానికి కొన్ని నియమాలున్నాయి.
Advertisement
మంగళవారం, గురువారం, శని వారాల్లో వివాహిత స్త్రీలు తలస్నానం చేయకూడదు అని నమ్ముతారు. ఈ రోజుల్లో జుట్టు కడగడం స్త్రీలకు, వారి కుటుంబాలకు మంచిది కాదు అంటారు. కొన్ని ప్రదేశాల్లో సోమవారం జుట్టు కడగడం కూడా నిషిద్ధంగా పరిగణించబడుతుంది. ఇది కుటుంబంలోని వ్యక్తుల ప్రగతిపై చెడు ప్రభావం చూపుతుంది. అంతేకాదు.. వారం రోజుల్లో కాకుండా అమవాస్య, పూర్ణిమ, ఏకాదశి రోజు స్త్రీలు జుట్టును కడగకూడదు. ఏకాదశమి రోజు ఉపవాసం ఉంటే మీ జుట్టును కడుక్కోవచ్చు. వివాహిత స్త్రీలు ఉపవాసానికి ఒక రోజు ముందు వారి జుట్టును కడగాలి.
Advertisement
Also Read : ఫిట్నెస్ ట్రైనర్ తో ప్రేమలో పడ్డ అమీర్ ఖాన్ బిడ్డ.. అది బాగా నచ్చిందట..!!
సోమవారం రోజు మీ జుట్టును కడుక్కోండి. మీరు ఆ రోజు ఉపవాసం ఉన్నట్టయితే మీ చేతులతో పూరుసు పువ్వులను మెత్తగా చేసి, వాటిని మీ జుట్టుకు పూయండి. అప్పుడు జుట్టు కడగాలి. మంగళవారం రోజు తలస్నానం చేయాల్సి వస్తే జామకాయ రసం లేదా జామకాయని పేస్ట్ చేసి దానిని తలకు పట్టించాలి. బుధవారం మీరు తలస్నానం చేయాల్సి వస్తే ముందుగా తులసి ఆకుల పేస్ట్ ని మీ జుట్టుకు పట్టించి ఆపై మీ తలని కడగాలి. గురువారం రోజు స్త్రీల జుట్టు కడుక్కోవడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం ఉండదు. గురువారం జుట్టును కడుక్కోవాల్సి వస్తే కొద్దిగా పసుపు కలిపి తలస్నానం చేయాలి. పెళ్లి మహిళలు తల స్నానం చేయడానికి వారంలోని ఉత్తమ రోజులు. శుక్రవారం, ఆదివారం, శరీరం సహకరించిన వారు శాస్త్రానికి విరుద్ధంగా పోతే తరువాత కాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
Also Read : Chanakya Niti : భార్య భర్తల మధ్య ప్రేమ ఉండాలంటే ఇవి తప్పకుండా పాటించాలి..!