Home » Viral Video : ఆకాశంలో విన్యాసాలు చేసిన యువ‌తి.. వీడియో చూస్తే ఆశ్చ‌ర్య పోవాల్సిందే..!

Viral Video : ఆకాశంలో విన్యాసాలు చేసిన యువ‌తి.. వీడియో చూస్తే ఆశ్చ‌ర్య పోవాల్సిందే..!

by Anji
Ad

చాలా ఏళ్ల అనుభ‌వం ఉన్నా స‌రే, స్కై డైవింగ్ చేసే ప్ర‌తిసారి హార్ట్‌రేట్ బీభ‌త్సంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా హెలికాప్ట‌ర్ లేదా ఏరోప్లేస్ నుంచి దూకే క్ష‌ణాన అరికాళ్ల‌లో భ‌యం పుట్టుకొస్తుంది. ఇక ఫ్రీ ఫాల్ స‌మ‌యంలో కూడా ఒక వైపు థ్రిల్లింగ్ ఉన్నా.. మ‌రోవైపు భ‌యం శ‌రీరాన్ని ఆవ‌హిస్తూనే ఉంటుంది. అయితే ఇలాంటి భ‌యంక‌ర‌మైన ఫీడ్స్‌ను వేరే లేవ‌ల్‌కు తీసుకొచ్చింది ఓ యువ‌తి.


ఈమె గాల్లో ఎవ‌రికీ సాధ్యం కాని విన్యాసాలు చేస్తూ ఆశ్చ‌ర్య‌పరిచింది. దీంతో ఆమె గుండె ధైర్యానికి స‌లామంటున్నారు నెటిజ‌న్లు. వైర‌ల్ అవుతున్న ఈ వీడియోలో ప్యార‌చూట్ ధ‌రించిన ఓ యువ‌తి హెలికాప్ట‌ర్ పై నుంచి కిందకు దూక‌డం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఆయువ‌తిని ఫాలో అవుతూ మ‌రొక స్కై డ్రైవ‌ర్ కూడా దూకాడు. ఆత‌రువాత యువ‌తి చేస్తున్న న‌మ్మ‌లేన‌టువంటి విన్యాసాల‌ను త‌న కెమెరాలో బంధించాడు. ఈ యువ‌తి మ‌నిషిపై గింగ‌రాలు తిరిగిన‌ట్టు గాలిలోనే వేగంగా తిరిగింది. త‌ల‌కిందులుగా ఆమె చేసిన విన్యాసాలు మ‌రింత ఆక‌ట్టుకునే విధంగా ఉన్నాయి.

Advertisement

ఇక త‌ల‌కిందులుగా తిరిగిన త‌రువాత ఆమె త‌న కాళ్ల‌ను చ‌క్రంలా గిర‌గిర తిప్ప‌డం కూడా మ‌నం వీడియోలో చూడ‌వ‌చ్చు. ఆకాశంలో అల్లంత ఎత్తున ఆమె చేస్తున్న విన్యాసాలు చూస్తే ఎవ‌రైనా స‌రే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఎర్త్ ఫిక్స్ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఈ యువ‌తి గ‌గ‌న విన్యాసాల‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. స్కై డైవింగ్ చేస్తూ ఎఫిక్ మూస్ ఫ‌ర్పామ్ చేసిన యువ‌తి అని దీనికి క్యాప్ష‌న్ జోడించింది. ఇప్ప‌టికే ఈ వీడియోకు 16ల‌క్ష‌ల వ్యూస్ 2ల‌క్ష‌ల 8వేల‌కు పైగా లైకులు వ‌చ్చాయి. దీనిని చూసిన నెటిజ‌న్లు అవాక్క‌వుతున్నారు. వామ్మో ఏమిటిది జీటీఏ గేమ్ మాదిరిగా తిరిగేస్తుందిగా.. ఇది చాలా అద్భుత‌మ‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి స్కై డైవింగ్ చేయాల‌ని మాకు ఉంద‌ని కొంద‌రూ పేర్కొంటున్నారు.

Also Read :  20th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

 

Visitors Are Also Reading