Home » ఐపీఎల్ వాయిదా వేయాలంటున్న ఆ జట్ల అభిమానులు…!

ఐపీఎల్ వాయిదా వేయాలంటున్న ఆ జట్ల అభిమానులు…!

by Azhar
Published: Last Updated on

ఐపీఎల్ 2022 లో ప్రస్తుతం కరోనా కలకలం రేగిన విషయం తెలిసిందే. దాంతో ఐపీఎల్ ఉంటుందా.. ఉండదా అని అందరూ చర్చించుకుంటుంటే… ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల అభిమానులు మాత్రం ఈ ఐపీఎల్ ను వాయిదా వేయాలి అని డిమాండ్ చేస్తూ… ‘CancelIPL’ అనే హాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఈ జట్ల అభిమానులు ఇలా చేయడానికి కారణాలు కూడా లేకపోలేదు.

ఐపీఎల్ చరిత్రలో అంత్యంత విజయవంతమైన ఈ రెండు జట్లు ప్రస్తుతం 2022 సీజన్ లో ఘోరంగా ఆడుతున్నాయి. 5 సార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇప్పటికే వరుసగా ఆరు మ్యాచ్ లలో ఓడిపోగా.. చెన్నై జట్టు ఆడిన 6 మ్యాచ్ లలో ఒక్క విజయం సాధించింది. దాంతో ఈ రెండు జట్లు చివరి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

దాంతో ఆ జట్ల అభిమానులు నిరాశలో ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో కరోనా కేసులు వచ్చాయి. ఇదే అదునుగా.. ప్రాణాలకంటే ఐపీఎల్ ముఖ్యమా… కరోనా కేసులు వస్తున్నాయి కాబట్టి ఈ సీజన్ ను కూడా గత ఏడాది మాదిరిగానే వాయిదా వేయాలని అంటున్నారు. చూడాలి మరి బీసీసీఐ ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటది అనేది.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో కరోనా గందరగోళం..!

వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!

 

Visitors Are Also Reading