Home » స్వయంభు మూవీలో సంయుక్త అలాంటి పాత్రలో నటిస్తుందా ?

స్వయంభు మూవీలో సంయుక్త అలాంటి పాత్రలో నటిస్తుందా ?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ కొనసాగుతుంది. పాన్ ఇండియా మూవీస్ లో స్వయంభు ఒకటి. నిఖిల్ సిద్దార్థ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ అని సమాచారం. భరత్ కృష్ణమాచారి అనే నూతన దర్శకుడు ఈ సినిమా చేస్తుండగా.. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ లో భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు.

Advertisement

ఠాగూర్ మధు సమర్పణలో రాబోతున్న భారీ బడ్జెట్ సినిమాకి మనోజ్ పరమహంస డీఓపీగా వ్యవహరిస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ రవి బసుర్ సంగీతం సమకూర్చుతున్నారు. బింబిసార ఫేమ్ వాసుదేవ్ మున్నెప్పగిరి ఈ  చిత్రానికి డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ సినిమాలో గోల్డెన్ లెగ్ సంయుక్తమీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సంయుక్త మీనన్ పుట్టిన రోజు సందర్భంగా తనకు విష్ చేస్తూ చిత్ర యూనిట్ ఓ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఫస్ట్ లుక్ అంటే మామూలుగా ఆ నటీనటులకు చెందిన స్టిల్స్ మాత్రమే ఉంటాయి.

Advertisement

కానీ వీళ్లు విడుదల చేసిన పోస్టర్ లో సంయుక్త మీనన్ కి బదులు ఓ శిల్పం లుక్ రిలీజ్ చేశారు. ఓ లుక్ సంయుక్త మీనన్ దేనని తెలుస్తూనే ఉంది. రిలీజ్ చేసిన ఆ పోస్టర్ ని బట్టి సంయుక్త మీనన్ స్వయంభులో ఓ రాజకుమారి పాత్రలో నటిస్తుందంటూ.. వార్తలు వైరల్ అవుతున్నాయి. లేకపోతే  ఓ దేవకన్య రోల్ కూడా అయి ఉండవచ్చని అనిపిస్తుంది. ఈ చిత్రం విషయంపై సినిమా యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఈ మూవీ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందని వస్తున్న అప్డేట్స్ ని బట్టి తెలుస్తోంది. ఈ మూవీతో సంయుక్త స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 సిల్క్ స్మిత మాదిరిగా ఉన్న ఈ బ్యూటీ ఎవరో తెలుసా ?

ఆ స్టార్ హీరోతో నటించొద్దు… కండిషన్ పెట్టిన జాన్వి కపూర్ తండ్రి…!

Visitors Are Also Reading