Home » చాలా మందికి లైఫ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్.. అనాథ ఆశ్రమంలో చేరడానికి కారణం ఏంటో తెలుసా ?

చాలా మందికి లైఫ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్.. అనాథ ఆశ్రమంలో చేరడానికి కారణం ఏంటో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్యంతో తాజాగా తిరిగిరాని లోకాలకు వెళ్లారు. విశాఖ నుంచి వస్తూ.. అనారోగ్యానికి గురైన రాకేష్ మాస్టర్.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని పలువురు సిని ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. దాదాపు 1500 సినిమాలకు కొరియగ్రఫీ అందించారు రాకేష్ మాస్టర్. 

Advertisement

రాకేష్ మాస్టర్ అకాల మరణంతో అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. టాలీవుడ్ లో తన టాలెంట్ తో స్పెషల్ ఇమేజ్ ని సంపాదించుకున్నారు మాస్టర్. పలువురు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రఫీ అందించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే రాకేష్ మాస్టర్ చాలా మంది డ్యాన్సర్లను కూడా ఇండస్ట్రీకి తీసుకొచ్చారు. టాలీవుడ్ లో ప్రస్తుతం స్టార్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లు రాకేష్ మాస్టర్ ద్వారానే పరిచయం అయ్యారు.  వీరిద్దరితో పాటు చాలా మందికి రాకేష్ మాస్టర్ తిండి పెట్టి మరీ షెల్టర్ ఇచ్చారు. తన నివాసంలోనే వారందరినీ ఉంచుకొని చాలా బాగా చూసుకున్నారట. 

Advertisement

 వీరికి కొరియగ్రఫీ పరంగా.. అన్ని విధాలుగా తనవంతు సహాయ, సహకారాలు అందించారు రాకేష్ మాస్టర్. అలాంటి వ్యక్తి ఒకానొక దశలో అనాథాశ్రమంలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సమస్యలు.. నా అనుకున్న వారు కొద్ది రోజుల కిందట దూరం అవ్వడంతో రాకేష్ మాస్టర్ ఒంటరిగా మిగిలిపోయారు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక ఆ సమయంలోనే మద్యానికి కూడా అలవాటు పడ్డాడట. అందరిపై నమ్మకం కోల్పోయిన రాకేష్ మాస్టర్ అనాథాశ్రమంలో జీవించాలని నిర్ణయించుకున్నారట. గత ఏడాది రాకేష్ మాస్టర్ హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని అబ్దుల్లాపూర్ మెట్ లో ఓ అనాథశ్రమంలో నివసించారు. నా అనుకున్న వారు దూరం పెట్టడంతోనే అలా చేశారట. టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన రాకేష్ మాస్టర్ ఓల్డేజ్ హోమ్ లో ఉండటం అందరినీ బాధ కలిగించింది. అక్కడ ఉండడమే కాదు.. తనవంతుగా ఆర్థిక సాయం హోమ్ కి అందించారు. మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో సందడి చేసిన రాకేష్ మాస్టర్ సడెన్ గా మరణించడం చాలా బాధకరమైన విషయమనే చెప్పాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆదిపురుష్ మూవీకి ఎదురుదెబ్బ.. టికెట్స్ క్యాన్సిల్

ఆదిపురుష్ మూవీ పై నెగిటివ్ పోస్ట్ లు తొలగిస్తే డబ్బులిస్తున్నారా ?

Rakesh Master : ప్రముఖ కొరియో గ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి

Visitors Are Also Reading