Home » కేసీఆర్ దృష్టి దేశం వైపు.. బిజెపి దృష్టి తెలంగాణ వైపు.. బీఆర్ఎస్ బిజెపికి కలిసివచ్చేనా..!!

కేసీఆర్ దృష్టి దేశం వైపు.. బిజెపి దృష్టి తెలంగాణ వైపు.. బీఆర్ఎస్ బిజెపికి కలిసివచ్చేనా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొంతకాలంగా దేశ రాజకీయాలు మారుతున్నాయి.. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా విస్తరిస్తున్నాయి.. ఈ తరుణంలో చాలామంది నాయకులు దేశ రాజకీయాలపై దృష్టి పెడుతున్నారు.. ఇప్పటికే జాతీయ పార్టీలుగా ఉన్న బిజెపి, కాంగ్రెస్ కు దీటుగా ఈ పార్టీలు విస్తరించడంలో ముందుకు వెళుతున్నాయి.. ఈ తరణంలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని, భారతీయ రాష్ట్ర సమితిగా మార్చారు.. ఇక ముందు దేశ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తానంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని స్థాపించారు. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్ కు సంబంధించి అన్ని రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు వెలిశాయి. కట్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో రెండు పర్యాయాలు తిరుగులేని సీఎంగా పేరు తెచ్చుకున్నాడు.

Advertisement

also read:డూప్ లేకుండా బాలయ్య బాబు చేసిన సాహసం ఏంటో తెలుసా ? టాలీవుడ్ లో బాలయ్యకే సాధ్యం !

Advertisement

బిజెపి, కాంగ్రెస్ శత విధాల ప్రయత్నాలు చేసిన ఆయనకు మాత్రం బ్రేక్ వేయడంలో విఫలమయ్యారు.. ఆయన ఎప్పుడు ఎలాంటి ఆలోచన చేస్తారో ఎలాంటి పథకాలు తీసుకువస్తారో,ప్రజలను ఏ విధంగా ఆకట్టుకుంటారో అంచనా వేయడం ఇతర నాయకులకు చాలా కష్టం.. ఈ క్రమంలో ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టి తన దృష్టిని దేశ రాజకీయాల వైపు మళ్ళించారు.. తెలంగాణపై ఇదివరకు ఉన్నంత దృష్టి ఇప్పుడు ఉండకపోవచ్చు.. మరి ఇది కాంగ్రెస్ పార్టీ వినియోగించుకుంటుందా లేదా అనేది చాలామంది మదిలో ఉన్న ప్రశ్న.. ఎందుకంటే కాంగ్రెస్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆధిపత్య పోరుతోనే సతమతమవుతోంది.. ఇక ప్రజల వద్దకు వెళ్లే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో తెలంగాణలో బండి సంజయ్ ఈటల రాజేందర్ సారథ్యంలో బిజెపి పుంజుకుంటుంది..

ఎలాగైనా బీఆర్ఎస్ కు గట్టి పోటీని ఇవ్వాలని శతవిధాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వైపు వెళ్లారు.. దీంతో బిజెపి ఆలోచనలకు కాస్త ఎక్కువగా పదును పెట్టే అవకాశం దొరికిందని వారు లోలోపల భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన దేశ రాజకీయాల గురించి ఆలోచిస్తే బిజెపి తెలంగాణలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.. కెసిఆర్ కు ప్రస్తుతము ఉన్న తరుణంలో తెలంగాణపై అంత దృష్టి పెట్టె అవకాశం తక్కువగా ఉందని చెప్పవచ్చు.. ఇదే ఆస్త్రాన్ని బీజేపీ వాడుకొని వారి ఆలోచనలకు పదును పెట్టాలని ముందడుగు వేస్తోంది.

also read:

Visitors Are Also Reading