Home » ఆమె ఓ స్టార్ నటి.. ఇంట్లో టీవీ కూడా లేదట.. డబ్బు ఏం చేస్తుందో తెలిస్తే గ్రేట్ అంటారు..!!

ఆమె ఓ స్టార్ నటి.. ఇంట్లో టీవీ కూడా లేదట.. డబ్బు ఏం చేస్తుందో తెలిస్తే గ్రేట్ అంటారు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో స్టార్డం వచ్చిన తర్వాత చాలామంది నటీనటులు డబ్బు బాగా సంపాదిస్తుంటారు.. ఆ విధంగా వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. మార్కెట్లోకి ఎలాంటి కొత్త కారు వచ్చినా,డ్రెస్ వచ్చినా,ఏది వచ్చిన ముందుగా ఇండస్ట్రీలో ఉన్న వారే అనుభవిస్తారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలా ఇండస్ట్రీకి చెందిన బుల్లితెర స్టార్ నటి మాత్రం దీనికంతటికి విరుద్ధంగా ఉంది.. కనీసం ఆమె ఇంట్లో కారు కాదు కదా చిన్న టీవీ కూడా లేదట. అలా అని ఆమె పిసినారి అనుకునేరు.. అదేమీ కాదు. ఇండస్ట్రీలో చాలా డబ్బులు సంపాదిస్తుంది.. వచ్చిన డబ్బంతా ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. గృహలక్ష్మి సీరియల్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కస్తూరి తులసి పాత్రలో అందరినీ ఆకట్టుకుంటుంది.

Advertisement

also read:boys love: అబ్బాయిలు ప్రేమలో పడితే ఈ మార్పులు కనిపిస్తాయి.. ఇందులో ఆ ఒక్కటి చాలా ఇంపార్టెంట్..!!

Advertisement

ఒక గృహిని పడే కష్టాలు, భర్తను అర్థం చేసుకొని ఉండడం అనే కోణంలో ఈ కథ సాగుతోంది.. ఇందులో తులసి పాత్రకు చాలా పేరు వచ్చిందని చెప్పవచ్చు. ఇలాంటి తులసి కేవలం సీరియల్ లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు స్పందిస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పెడుతూ అభిమానులను ఆనందపరుస్తుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమె మెట్రో ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు తన మొబైల్ పోగొట్టుకుందట.. దీంతో మెట్రో అధికారులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు వెతికి ఆమె మొబైల్ తీసుకొచ్చి ఇచ్చారు.. మొబైల్ తీసుకొచ్చినందుకు మెట్రో అధికారులకు హ్యాట్సాఫ్ చెబుతూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా నాకు గౌరవం ఇచ్చినందుకు థాంక్స్ అంటూ ట్వీట్ చేసింది..

చాలామంది నెటిజెన్లు అంత పెద్ద స్టార్ నటి వి మెట్రోలో ఎందుకు ప్రయాణిస్తున్నావు నీకు కార్ లేదా అని క్వశ్చన్ వేశారు.. లేదంటే పబ్లిసిటీ కోసమా అంటూ ప్రశ్నించారు.. దీనికి స్పందిస్తూ కస్తూరి ఏమన్నది అంటే నాకు కారు కాదు కదా టీవీ,ఏసి కూడా లేదు అంటూ బదులిచ్చిందట.. నేను నార్మల్ లైఫ్ లీడ్ చేస్తాను అంటూ రిప్లై ఇచ్చిందట.. దీంతో మరో నెటిజన్ వచ్చిన డబ్బు అంతా ఏం చేస్తావని ప్రశ్నించాడు.. నాకు వచ్చిన డబ్బంతా మెడికల్ హెల్ప్ మరియు చైల్డ్ కేన్సర్ పేషంట్ల కోసం ఖర్చు పెడతానని తెలియజేసింది.. ఇది చూసిన నెటిజన్లంతా ఆమెను నిజంగా నువ్వు గ్రేట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.. కస్తూరి ఇదివరకే నాగార్జున అన్నమయ్య చిత్రంలో హీరోయిన్ గా చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

also read:

Visitors Are Also Reading