Home » డూప్ లేకుండా బాలయ్య బాబు చేసిన సాహసం ఏంటో తెలుసా ? టాలీవుడ్ లో బాలయ్యకే సాధ్యం !

డూప్ లేకుండా బాలయ్య బాబు చేసిన సాహసం ఏంటో తెలుసా ? టాలీవుడ్ లో బాలయ్యకే సాధ్యం !

by AJAY

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. రీసెంట్ గా బాల‌య్య అఖండ సినిమాతో సూప‌ర్ డూప‌ర్ హిట్ అందుకున్నారు. క‌రోనా థ‌ర్డ్ వేవ్ త‌ర‌వాత వ‌చ్చిన ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సినిమాల ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు ఆశ‌లు చిగురించాయి. ఈ చిత్రం త‌ర‌వాత బాల‌య్య గోపిచంద్ మ‌లినేనితో సినిమాను కూడా ప్రారంభించారు.

ALSO READ : మోహ‌న్ బాబుకు 10ల‌క్ష‌ల ఫైక్ క‌ట్టిన ఆర్తిఅగర్వాల్..ఎందుకో తెలుసా..!

 

ఇదిలా ఉంటే బాల‌య్య‌తో న‌టించిన ప్ర‌తిఒక్క‌రూ చెప్పే మాట ఆయ‌న స్టంట్ లు ఓన్ గా చేస్తార‌ని స్టంట్ లు చేసేట‌ప్పుడు అస్స‌లు బ‌య‌ప‌డ‌ర‌ని కూడా చెబుతుంటారు. బాల‌య్య‌కు ఈ అల‌వాటు ఇప్పుడు వ‌చ్చింది కాదు. కెరీర్ ప్రారంభం నుండి బాల‌య్య డూప్ లేకుండా యాక్ష‌న్ సీన్ లు చేస్తూ ద‌ర్శ‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచేశారు. ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య సీమ సింహం సినిమాలో చేసిన ఓ సీన్ అంద‌ర్నీ అవ‌కాయ్యేలా చేసింది.

ఈ సినిమాలో ట్రాఫిక్ లో బాల‌య్య ఓ హాస్పిట‌ల్ కు వెళ్లే స‌మయంలో ఫ్లై ఓవ‌ర్ పై నుండి దూకే సీన్ ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సీన్ ను బాల‌య్య డూప్ లేకుండా చేయ‌డం విశేషం. ఈ స‌న్నివేశాన్ని తెర‌కెక్కించింది హైద‌రాబాద్ లోని నారాయ‌ణ‌గూడ ఫ్లై ఓవ‌ర్ పై కాగా ఆ ఫ్లై ఓవ‌ర్ ఎత్తు 40 అడుగులు ఉంటుంది. అయితే బాల‌య్యను ఆ ఫ్లై ఓవ‌ర్ పై నుండి దూకడం అవ‌స‌రమా అని ద‌ర్శ‌కుడు డూప్ ను పెట్టి మ్యానేజ్ చేస్తామ‌ని చెప్పార‌ట‌.

కానీ బాల‌య్య ఇలాంటి థ్రిల్లింగ్ సీన్ ను డూప్ పెట్టి చేయిస్తే ప్రేక్ష‌కుల‌కు కిక్ ఉండ‌ద‌ని తానే చేస్తాన‌ని చెప్పారట‌. ఈ ఫైట్ గురించి ఈ సినిమాలో ఫైట్ మాస్ట‌ర్ గా చేసిన క‌న్న‌ల్ క‌న్న‌ల్ బాల‌య్య పై ప్ర‌శంస‌లు కురిపించారు. బాల‌య్య ఎంతో డెడికేష‌న్ ఉన్న న‌టుడ‌ని అన్నారు. ఎంత మంది ఉన్నా బాల‌య్య ఫైట్ సీన్ లు చేయ‌డానికి వెన‌కాడ‌ర‌ని చెప్పారు.

Visitors Are Also Reading