నల్గొండ సభలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి . పాలు ఇచ్చే బర్రెను వదిలి.. దున్నపోతును తెచ్చుకున్నారు అని కేసీఆర్ అన్నదానికి.. తెలంగాణ ప్రజలు కంచరగాడిదను ఇంటికి పంపి.. రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగిన 15,750మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
Advertisement
స్టాప్ నర్స్, సింగరేణి ఉద్యోగులకు నియామక పత్రాలు ఇచ్చామని అన్నారు. నేడు కానిస్టేబుల్ నియామకాల పత్రాలు ఇస్తున్నాం అని అన్నారు. ఎవరు అడ్డుపడ్డా, కేసీఆర్, హరీష్ చొక్కా లాగు చించుకున్నా అన్ని నియామకాలు పూర్తి చేస్తాం అని తేల్చి చెప్పారు. కొందరు అన్నారు అందరికీ నియామక పత్రాలు ఇంటికే పంపొచ్చు కదా హైదరాబాద్ ఎందుకు పిలవడం అని?… మీ అందరినీ సంతోషంగా చూస్తేనే నాకు కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర పడుతుందని సీఎం రేవంత్ అన్నారు. మీ అందరి సంతోషంలో మేము కూడా భాగస్వాములం అవ్వాలని పిలిచామని తెలిపారు.
Advertisement
తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే మరో పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పారు. కేసీఆర్ ఎలా అధికారంలోకి వస్తారో తాను చూస్తానని.. ఇక్కడే ఉంటానని తెలిపారు. అసెంబ్లీ రాని వారికి అధికారం ఎందుకు అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు గెలవక పోతే వెంటనే పదవులు ఇచ్చిన కేసీఆర్…ఈ తెలంగాణ పిల్లలు నీకు ఎం అన్యాయం చేశారు? అని ప్రశ్నించారు. అసెంబ్లీ కి రావడానికి కేసీఆర్ కి ధైర్యం లేదు కానీ నల్గొండ పోయి మాట్లాడుతున్నారు అని ఫైర్ అయ్యారు. ఆడ్డ మీద కొట్లడటం కాదు.. చట్ట సభలోకి రావాలని కేసీఆర్ ను కోరారు. ఈ రోజు కేసిఆర్ మళ్ళీ నీటి మాట పట్టిండు.. ఎందుకంటే ఆయన దగ్గర మరో ఏ సెంటి మెంటు లేదని విమర్శించారు. మొన్న నల్గొండ సభకు పోతే ప్రజలు కోడిగుడ్లు, టమాటాలు పెట్టీ కొట్టారని ఎద్దేవా చేశారు.