Home » అమృత ప్రణయ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుందా ? కార్తికేయతో డ్యాన్స్ చేసింది అందుకేనా ?

అమృత ప్రణయ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనుందా ? కార్తికేయతో డ్యాన్స్ చేసింది అందుకేనా ?

by Anji
Published: Last Updated on
Ad

అమృత ప్రణయ్ పేరు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా పరిచయం చేయాల్సిన అవసరమే ఉండదు అనుకుంటా. అలాగని వీరు ఏమి రాజకీయ నాయులు ఏమి కాదు..సనీ సెలబ్రిటీలు కూడా కాదు. వీరు చేసుకున్న లవ్ మ్యారేజ్ వీరి పాలిట శాపంగా మారింది. చివరికీ ప్రణయ్ ప్రాణాలు కూడా కోల్పోయేవిధంగా చేసింది. అలాంటి అమృత ప్రణయ్ ప్రస్తుతం హీరో కార్తికేయతో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇందుకు సంబంధించి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన మారుతీరావు కూతురు అమృత. ఈమె ప్రణయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే దీంతో అమృత తండ్రి మారుతీరావు తట్టుకోలేక కులం తక్కువ ఆస్తి తక్కువ అని సుఫారీ ఇచ్చి ప్రణయ్ ని Ha త్య చేయించిన విషయం తెలిసిందే. అప్పట్లో దేశవ్యాప్తంగా  ప్రణయ్ మరణం కలకలం రేపింది. మారుతీరావును పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఆ తరువాత మారుతీ జైలు నుంచి విడుదలై అవమానం భరించలేక ఉరేసుకొని తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. ప్రణయ్ మరణించినప్పటి నుంచి అమృత అత్తవారింటి దగ్గరే ఉంది తప్ప.. తన సొంతింటికి మాత్రం రాలేదు. తన తండ్రి చనిపోయినా కూడా చూడటానికి వెళ్లలేదు.

Advertisement

తన కొడుకుని చూసుకుంటూనే అమృత జీవనం సాగిస్తోంది. అలాంటి అమృత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే తాజాగా రిలీజ్ అయిన బెదురులంక 2012 హీరో కార్తీకేయతో ఢ్యాన్స్ చేస్తున్నటువంటి వీడియో సోషల్ మీడియా తెగ వైరల్ అవుతోంది. చీరకట్టులో అద్భుతమైన పర్ఫామెన్స్ తో కార్తికేయతో డ్యాన్స్ లో మునిగిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. అంతేకాదు.. అమృత ప్రణయ్ ఫ్యాషన్ పై దృష్టి సారించిందని సినిమా రంగంలోకి రాావాలని ఆమె ఆశీస్తుందని కొంతమంది ఆమెకు తెలిసిన వారు పేర్కొంటున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

అతను స్టార్ క్రికెటర్.. కానీ కూతురు స్కూల్ ఫీజు కూడా చెల్లించలేని పరిస్థితి..!

 మహేష్ బాబు – రానా మధ్య వివాదం…కారణం ఆ హీరోయిన్ ?

Visitors Are Also Reading