భార్య భర్తల బంధానికి సమాజంలో ఎంతో గౌరవం ఉంటుంది. సంసారం లో ఇద్దరూ కలిసి మెలిసి ఉన్నప్పుడే వారి కుటుంబంలో ఆనందం ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో భార్యల కు భర్త పైన ఇష్టం పోతుంది అని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భర్త భార్యకు సమయం ఇవ్వకపోతే కుటుంబం లో గొడవలు తప్పవు అని చెబుతున్నారు.
Advertisement
Also Read:
కొంతమంది భర్తలు ఎంతో కష్టపడి పని చేస్తారు. డబ్బు సంపాదించాలని పగలు రాత్రి అనకుండా కష్టపడతారు. అయితే భార్యలు భర్త సంపాదించే ఆస్తుల కంటే వారికి సమయం కేటాయించాలి అని కోరుకుంటారట.
Advertisement
ప్రతి రోజు భర్త తమతో కాస్త సమయం గడపాలని కోరుకుంటారు. ఉదయం లేవగానే భర్త తో కలిసి టీ తాగుతూ సరదాగా మాట్లాడాలని కోరుకుంటారు. అంతే కాకుండా తమ తో పాటు ఫ్యామిలీ ఫంక్షన్ లకు భర్త రావాలని కోరుకుంటారు.
ఒకవేళ భర్త తనకు సమయాన్ని కేటాయింకపోతే కోప్పడటం లాంటివి చేస్తారు. అలానే కొంతకాలం జరిగితే భర్త పై సైతం ఇష్టం పోతుంది అని మానసిక నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భర్త ఎంత బిజీగా ఉన్నా భార్య కోసం సమయం కేటాయించాలి అని చెబుతున్నారు.
Advertisement
Also read :బుల్లితెర పై కళ్యాణ్ రామ్ రికార్డు.. మొదటి మూవీగా బింబిసార..!