భార్యాభర్తల బంధం చాలా అన్యోన్యమైనది. జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉండి కలిసి ఉండాల్సిన భార్యాభర్తలు ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతున్నారు. ప్రతి దానికి ఇద్దరం సమానం అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఏదైనా చిన్న విషయానికి కూడా గొడవ పడినప్పుడు ఎవరో ఒకరు సద్దుమనిగితే ఆ గొడవ అంతటితో ఆగిపోతుంది. ఇద్దరూ మాట మాట అనుకోవడం వల్ల గొడవ పెరిగి పెద్దది అయ్యి వివాదానికి దారితీస్తుంది.
Advertisement
భార్య గొడవ పెట్టుకున్నప్పుడు భర్త సైలెంట్ గా ఉండాలి. భర్త కోపంలో ఉన్నప్పుడు భార్య కూడా సైలెంట్ గా ఉండాలి. అంతేకానీ ఇద్దరూ కోపంతో రగిలిపోయి మాట్లాడకూడదు. ఒకరికి కోపం వచ్చినప్పుడు వారు చేసింది తప్పైనా సరే మనం సైలెంట్ గా ఉండాలి. ఎందుకంటే వాళ్లు ఆ సమయంలో కోపంగా ఉంటారు కాబట్టి. కోపంలో మనం ఏం చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు. వారికి కోపం తగ్గిన తర్వాత అదే విషయాన్ని నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నించాలి.
Advertisement
కోపం చల్లారిన తర్వాత ఆ విషయాన్ని చెప్పి వారి తప్పు తెలుసుకునేటట్టుగా చేయాలి. అప్పుడు ఎదుటివారు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఇంకోసారి గొడవ పడ కుండా ఉంటారు. వారి తప్పుని తెలుసుకొని సైలెంట్ గా ఉంటారు. అంతేకానీ భార్య గొడవ పడుతుందని భర్త కూడా గొడవ స్టార్ట్ చేస్తే ఆ గొడవ మరి పెద్దది అవుతుంది. భార్య గొడవ పడిన సమయంలో భర్త సైలెంట్ గా ఉండి వారి కోపాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఇద్దరు మధ్య గొడవ సద్దుమణిగి చాలా సంతోషంగా ఉంటారు.
ఇవి కూడా చదవండి :
రోహిత్ శర్మకు బిగ్ షాక్.. టీమిండియా కెప్టెన్ గా అజింక్య రహానే !
JD Chakravarthy : కట్టుకున్న భార్యనే నాకు విషం పెట్టి చంపాలని చూసింది..!
SV కృష్ణా రెడ్డి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఎందుకు మిస్ అయిందంటే ?