Home » టాలెంట్ ఉన్న ఈ హీరోలు ఎందుకు సక్సెస్ సాధించలేకపోతున్నారు ?

టాలెంట్ ఉన్న ఈ హీరోలు ఎందుకు సక్సెస్ సాధించలేకపోతున్నారు ?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే కేవలం  టాలెంట్ ఒక్కటి మాత్రమే సరిపోదు. టాలెంట్ తో పాటు  అదృష్టం కూడా కలిసి వస్తేనే రాణిస్తారు.  అలా అదృష్టం లేకపోవడం వల్లనే చాలామంది స్టార్స్ తెరమరగు అయిపోతున్నారు. అందుకే సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ కన్నా ముందు సక్సెస్ ఉండాలి . అసలు ఎలాంటి టాలెంట్ లేకుండా కథలో దమ్ము ఉండి, డైరెక్టర్ మంచి టెక్నీషియన్ అయినా కూడా ఆ హీరో ఖచ్చితంగా పెద్ద హీరో అయ్యే అవకాశం ఉంటుంది. 

Also Read :   ‘శాకుంతలం’ ఓటిటి డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎక్కడంటే….?

Advertisement

ఉదాహరణకు గంగోత్రి సినిమా సమయంలో అల్లు అర్జున్ ని చూసిన వారు  చాలా మంది ట్రోల్ చేశారు. కానీ దర్శకేంద్రుడి మాయాజాలం పనిచేసి ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో అల్లు అర్జున్ ఈ రోజు పాండ్ ఇండియా స్టార్ అయ్యాడు. లేకుంటే తండ్రి లాగా సినిమా నిర్మాణం చేయాల్సి వచ్చేది.మరి అలా కాకుండా నటన ఇరగదీయ గలిగే సత్తా ఉండి ఒక్క హిట్ కూడా లేకపోవడంతో కొంత మంది హీరోల భవిష్యత్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. ఆ హీరోల్లో చెప్పుకోవాల్సిన వ్యక్తి ముందుగా అక్కినేని అఖిల్. అక్కినేని అనే బ్రాండ్ కి వారసుడు తండ్రి, తాత, అమ్మ, అన్న అందరూ నటీనటులే. అయినా కూడా సక్సెస్ అఖిల్ కి ఆమడ దూరంలో ఉంది. పోనీ అఖిల్ చేతకాని వాడు అనుకోవడానికి లేదు. 

Advertisement

Also Read :  The Kerala Story Movie Review : ది కేరళ స్టోరీ రివ్యూ… వివాదాలకు కేరాఫ్ అడ్రస్

ఏజెంట్ సినిమా కోసం అఖిల్ దారుణమైన కసరత్తులు చేసి తన నటనను బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు. అయినా కూడా ఒక్క సినిమా కూడా ఇప్పటి వరకు హిట్ పడలేదు. పైగా అతడి కెరీర్ పై ఇప్పుడు అక్కినేని  అభిమానులకి చాలా బెంగగా ఉంది. ఇక ఇలాగే బ్యాగ్రౌండ్ గట్టిగా ఉన్నా మరో హీరో పూరి ఆకాశ్. తండ్రి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కానీ అతడు కూడా తీసిన అన్ని సినిమాలు ప్లాప్. బాగా నటించగలడు, ఫైట్స్, డాన్స్ కూడా ఇరగదీస్తున్నాడు. కానీ ఇతడికి కూడా ఎందుకో ఒక సరైన స్టోరీ పడడం లేదు. అన్ని కలిసి వస్తే కచ్చితంగా ఆకాష్ మంచి స్టార్ అవ్వగలడు.  

Also Read :  ‘ఏజెంట్’ నిర్మాతలకు భారీ నష్టాలు… రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చేసిన అఖిల్!

Visitors Are Also Reading