Home » సమంత ఎప్పుడు సంతోషంగానే ఉండాలి : నాగచైతన్య

సమంత ఎప్పుడు సంతోషంగానే ఉండాలి : నాగచైతన్య

by Bunty
Ad

మరో వారం రోజుల్లో నాగచైతన్య కస్టడీ సినిమా విడుదల కానుంది. నాగచైతన్య కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఇదే. ఈ సినిమాలో చై కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి. పైగా మానాడు వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకట్రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంచనాలు తారస్థాయికి చేరాయి. ద్విభాషా సినిమాగా రూపొందిన కస్టడీ మే 12న విడుదల కానుంది.

READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్

Advertisement

ఇదిలా ఉంటే, కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడిన నాగచైతన్య అతని పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ముఖ్యంగా సమంతతో విడాకుల వ్యవహారంపై మొదటిసారి పెదవి విప్పాడు. సమంత, నేను విడిపోయి రెండేళ్లు అవుతుంది. చట్టప్రకారం విడాకులు తీసుకుని ఏడాది అవుతుంది. న్యాయస్థానం కూడా మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేము మా జీవితాల్లో సాఫీగా ముందుకు సాగిపోతున్నాం. మా లైఫ్ లోని ప్రతి దశను నేను గౌరవిస్తున్న. సమంత మంచిమనిషి.

Advertisement

READ ALSO : The Kerala Story Movie Review : ది కేరళ స్టోరీ రివ్యూ… వివాదాలకు కేరాఫ్ అడ్రస్

After Divorce what Samantha did with naga chaitanya mangalsutra | Samantha: నాగచైతన్య కట్టిన తాళిని సమంత ఏం చేసిందో తెలుసా ... ?– News18 Telugu

ఆమె ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి. సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని వదంతుల వల్లే మా మధ్య టర్మ్స్ ఇబ్బందికరంగా మారాయని తెలిపారు. ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్టు జనాల్లోకి వెళ్లింది. ఇది నన్ను ఎంతగానో బాధ పెట్టింది. అలాగే ఈ మొత్తం వ్యవహారంలో మరో చెత్త విషయం ఏమిటంటే, నాతో ఎలాంటి సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగారు. అసంబద్ధమైన వార్తలు, పుకార్లు సృష్టించడం వల్ల ఆ సదరు వ్యక్తిని అగౌరవపరిచినట్లు అయ్యింది. మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత జీవితం పై పలువురు నన్ను ప్రశ్నిస్తుంటారు” అని ఆవేదన వ్యక్తం చేశారు చైతన్య.

READ ALSO : ‘శాకుంతలం’ ఓటిటి డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎక్కడంటే….?

Visitors Are Also Reading