Home » ‘శాకుంతలం’ ఓటిటి డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎక్కడంటే….?

‘శాకుంతలం’ ఓటిటి డేట్ ఫిక్స్… స్ట్రీమింగ్ ఎక్కడంటే….?

by Bunty
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ చిత్రంపై సమంత ఎన్నో ఆశలను పెట్టుకుంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తన కెరీర్ లో బెస్ట్ అని చెప్పింది. కొన్ని పాత్రలు అలా వస్తాయి. కొన్ని మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి అనేటట్టుగా శాకుంతలం ఉంటుందని విడుదలకు ముందు చెప్పుకొచ్చింది.

READ ALSO : అఖిల్ వల్ల భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్న చరణ్..!

Advertisement

సమంత శకుంతలం పాత్రలో, మలయాళం నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన ఫస్ట్ షో నుంచి నెగిటివ్ టాక్ వినిపించింది. రెండో షోకి సినిమాకి రావడం మానేసారు. విడుదలైన తొలి రోజు నుంచే నెగటివ్ టాక్ రావడంతో నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో అలరించేందుకు రెడీ అవుతుంది.

Advertisement

READ ALSO : Ramabanam Review: ‘రామబాణం’ రివ్యూ.. గోపిచంద్ సాలిడ్ కంబ్యాక్

Samantha Ruth Prabhu's Shaakuntalam release postponed to this date - Hindustan Times

ఈనెల 12న శాకుంతలం సినిమా అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుందట. కాగా, ఈ చిత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడు. దిల్ రాజు కూడా శాకుంతలం చిత్రం విజయం సాధిస్తుందని నమ్మి ముందస్తుగానే ప్రీమియర్ షోలను వేయించాడు. ఈ సినిమా చూసిన వారందరూ ఈ సినిమా నచ్చలేదని చెప్పారు.

READ ALSO : X, Y, Z, Z+ కేటగిరి భద్రత అంటే ఏంటి? ఎవరికి ఈ భద్రత కల్పిస్తారు.

Visitors Are Also Reading