Home » పిండం కాకికే ఎందుకు పెట్టాలి..పురాణం ఏం చెబుతోంది..!!

పిండం కాకికే ఎందుకు పెట్టాలి..పురాణం ఏం చెబుతోంది..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బలగం సినిమా తన హవా చాటుతోంది.. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ అనుకోని విధంగా చరిత్ర క్రియేట్ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఒక మనిషి చనిపోతే తొమ్మిది రోజులలో జరిగే తంతు ఈ సినిమాలో పూర్తిగా చూపించారు.. ఇందులో మరీ ముఖ్యంగా కాకి పిండాన్ని ముట్టకపోవడం చుట్టే కథ తిరుగుతుంది.. మరి పిండాన్ని కాకి ఎందుకు ముట్టాలి.. గరుడ పురాణం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. అప్పట్లో భగవద్గీత కథలు,పురాణాలు,చరిత్రకు సంబంధించిన అంశాలు, జానపద కథలను తీసుకొని సినిమాలు తీసేవారు.

also read:నాగచైతన్య,అఖిల్ రేంజ్ లో సుశాంత్ సక్సెస్ కాకపోవడానికి కారణం అదేనా ?

Advertisement

కానీ ప్రస్తుతం ప్రజల అభిరుచులు మారడంతో సినిమా కథలు కూడా మారుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో మనిషి జీవితంతో ముడిపడి ఉండే చావు దీనికి సంబంధించిన కర్మకాండలు,దశదినకర్మలతో తెరికెక్కించిన సినిమానే బలగం. కొత్త దర్శకుడైన వేణు ఎల్దండి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పలు అంతర్జాతీయ అవార్డులు అందుకున్న ఈ మూవీ చరిత్ర క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతనికి ఇష్టమైన ఆహార పదార్థాలు అన్ని వండి మూడవరోజు, ఐదవ రోజు, చివరగా 11వ రోజున పిట్టకు పెడతారు. ఆ పిండాన్ని తప్పనిసరిగా పక్షి ముట్టాలి.. అంటే ఆ పిండాన్ని కాకి ముడితేనే చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ శాంతిస్తుందట..

Advertisement

also read:అమ్మాయి కాదు, అబ్బాయే! ది కేర‌ళ స్టోరి!

ఇలా బలగం సినిమాలో దీన్నే మెయిన్ టాపిక్ గా తీసుకున్నారు.అదే అంశం మీద కొంతమంది శాస్త్ర పండితులు మాట్లాడుతూ.. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి ఆ* ప్రేతాత్మగా మారి పక్షి రూపంలో ఇంటి చుట్టే తిరుగుతుందట. ఇలా మూడవ,ఐదవ, 11వ రోజు తర్వాత చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్థాలు వండి, స్మశాన వాటిక వద్దకు వెళ్లి మొక్కుతారు. అలా మొక్కడం వల్ల పక్షి రూపంలో ఆత్మ వచ్చి రుచి చూసి వెళ్తుందని దాని ఫలితంగా అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు. ఒకవేళ పక్షి ముట్టకపోతే ఏదో ఒక లోపం కలుగుతుందని, అరిష్టం ఏర్పడుతుందని తప్పనిసరిగా కాకి ముట్టాలని ప్రజలు కోరుకుంటారు.

also read:

Visitors Are Also Reading