Home » “ఆస్కార్” స్టేజ్ పై స్టెప్పులు వేయాల‌ని చ‌ర‌ణ్ అనుకుంటే ఎన్టీఆర్ ఎందుకు నో చెప్పారు..! లీక్ అయిన అస‌లు మ్యాట‌ర్..!

“ఆస్కార్” స్టేజ్ పై స్టెప్పులు వేయాల‌ని చ‌ర‌ణ్ అనుకుంటే ఎన్టీఆర్ ఎందుకు నో చెప్పారు..! లీక్ అయిన అస‌లు మ్యాట‌ర్..!

by AJAY
Ad

95వ ఆస్కార్ వేడుక‌ల్లో తెలుగు సినిమాకు ఎన‌లేని గౌర‌వం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ లు హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ కు నామినేట్ అవ్వ‌డ‌మే కాకుండా ఒరిజిన‌ల్ సాంగ్ కేట‌గిరిలో నాటు నాటు పాట‌ అవార్డును సైతం ద‌క్కించుకుంది. ఇక ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ రావ‌డంతో చిత్ర దర్శ‌కుడు మ‌రియు సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి సింగ‌ర్ రాహుల్ సిప్లింగ‌జ్, పాట‌ను రాసిన చంద్ర‌బోస్ ఆస్కార్ వేడుక‌లో పాల్గొన్నారు.

ALSO READ : నైట్ పార్టీల‌కు విరాట్ అనుష్క‌లు ఎందుకు దూరంగా ఉంటారో తెలుసా..?

Advertisement

RRR Oscor

అయితే ఆస్కార్ వేడుక‌లో నాటు నాటు పాట‌కు ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి లైవ్ ప‌ర్ఫామెన్స్ ఇస్తాడ‌ని అభిమానులు ప్రేక్ష‌కులు ఎదురు చూశారు. కానీ ఎన్టీఆర్ చ‌ర‌ణ్ లు డ్యాన్స్ చేయ‌లేదు. దాంతో అభిమానులు నిరాశ చెందారు. అయితే తాజాగా నెట్టింట ఓ ఆస‌క్తిక‌రమైన వార్త వైర‌ల్ అవుతోంది. నిజానికి రామ్ చ‌ర‌ణ్ ఆస్కార్ వేడుక‌లో స్టెప్పులు వేయ‌డానికి ఎంతో ఆస‌క్తిచూపించ‌డాట‌. కానీ ఎన్టీఆర్ మాత్రం పెద్ద‌గా ఇంట్రెస్ట్ చూపించ‌లేద‌ట‌.

Advertisement

డ్యాన్స్ చేయాలంటే రిహాల్స‌ల్స్ చేయాలి కాబ‌ట్టి రిహాల్సల్స్ చేయ‌డానికి ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంద‌ని ఎన్టీఆర్ కామ్ గా ఉండిపోయార‌ట‌. అంతే కాకుండా ఆస్కార్ వేడుక‌కు మొద‌టిసారి వెళ్లారు కాబ‌ట్టి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌డానికి డ్యాన్స్ చేయాల‌ని అనుకున్నారు. కానీ అప్ప‌టికే యూఎస్ఏ లో సినిమా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హించారు కాబ‌ట్టి రావాల్సిన క‌వ‌రేజ్ వ‌చ్చింద‌ని.. డ్యాన్స్ చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని ఎన్టీఆర్ సైలెంట్ గా ఉన్నార‌ట‌. ఇక ఎన్టీఆర్ ఆస‌క్తి చూపించ‌క‌పోవడంతో రామ్ చ‌ర‌ణ్ కూడా సైలెంట్ గా ఉండిపోయార‌ట‌.

ALSO READ ; “బలగం” సినిమాలో ప్రియదర్శి పాత్రను బదులుకున్న స్టార్ కమెడియన్!

Visitors Are Also Reading