Home » జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో బలవంతంగా కాపీ ట్యూన్ మణిశర్మతో చేయించిన వ్యక్తులు ఎవరు? ఎందుకు చేసారు ?

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో బలవంతంగా కాపీ ట్యూన్ మణిశర్మతో చేయించిన వ్యక్తులు ఎవరు? ఎందుకు చేసారు ?

by Sravya
Ad

సంగీత దర్శకుడు మణిశర్మ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. మణిశర్మ ఎప్పటినుండో సంగీత దర్శకుడుగా పని చేస్తూ మంచి పేరుని తెచ్చుకున్నారు. చాలామంది టాలీవుడ్ సీనియర్ నటులకి గుర్తుండిపోయే సూపర్ హిట్ ఆల్బమ్ సాంగ్స్ ని అందించారు మణిశర్మ. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా చాలామందికి మంచి ఆల్బమ్ సాంగ్స్ ని మణిశర్మ అందించారు. అయితే ఒకప్పుడు మంచి సంగీత దర్శకుడుగా పేరుపొందిన మణిశర్మ ప్రస్తుతం అవకాశాలు లేక సినిమాలకి దూరంగా ఉంటున్నారు.

Advertisement

గత కొంతకాలంగా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉంటున్నారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మణిశర్మ ఆసక్తికరమైన విషయాలని పంచుకోవడం జరిగింది. ఎన్టీఆర్ కోసం ఒక పాటని బలవంతంగా కాపీ చేశారట మణిశర్మ. ఇక వివరాల్లోకి వెళితే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఆది సినిమా ఫ్యాక్షన్ డ్రామా తో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ ని నమోదు చేసుకుంది. ఆ సినిమాలో ప్రతి పాటతో పాటుగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఒక రేంజ్ లో ఉంది. ఈ మూవీలో ఒక సాంగ్ ని మణిశర్మ కాపీ చేయాల్సి వచ్చిందిట.

Advertisement

మొదటి పాట చిక్ చిక్ బం బం సాంగ్ ని మణిశర్మ కాపీ చేశారట. టర్కీ సాంగ్ సీమరిక్ నుండి కాపీ చేసారట. మణిశర్మ కి ఇష్టం లేకపోయినా దర్శక నిర్మాతలు బలవంతంగా ఆ పాటని పూర్తిగా కాపీ చేసేసారట మణిశర్మ. సోషల్ మీడియాలో ఈ పాట వలన ట్రోల్స్ ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పాట మాత్రమే కాకుండా తన కెరియర్ లో ఇలా బలవంతంగా కొన్ని పాటలు కాపీ కొట్టినట్లు మణిశర్మ చెప్పారు. ఇంటర్వ్యూలో తన బాధను మొత్తం ఇలా పంచుకున్నారు మణిశర్మ. అలానే నేను హర్ట్ అయ్యేది దేనికంటే మహేష్ పవన్ వంటి స్టార్ హీరోలైన ఒక అవకాశం ఇవ్వాలని మణిశర్మ అన్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading