దేశవ్యాప్తంగా ఇప్పుడు రాజమౌళి పేరు ఎంతో ఫేమస్. దాదాపుగా రాజమౌళి అంటే తెలియని వారు ఎవ్వరూ లేరు. రాజమౌళితో పాటు ఆయన సోదరుడు కీరవాణి అయితే ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీలో సక్సెస్ పుల్ సంగీత దర్శకునిగా పేరు తెచ్చుకున్నారు. రాజమౌళి తెలుగు సినిమా డైరెక్టర్‌గా ఎప్పటినుంచో అందరికీ పరిచయమైనప్పటికీ.. ఇప్పుడు ఆయన తీసిన సినిమాలు హలీవుడ్ రేంజ్‌కి వెళ్లడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. రాజమౌళి సినిమాలో తన కుటుంబం మొత్తం ఏదో ఒక విభాగంలో పని చేసే ఉంటారు.
ఇక రాజమౌళి గారిది ఉమ్మడి కుటుంబం. వాళ్లు సినిమా తీసినా ఉమ్మడిగానే కష్టపడుతుంటారు. అన్నదమ్ముల పిల్లలైనప్పటికీ కొంత మందికి ఒకటే ఇంటి పేరుండదనుకోవచ్చు. రాజమౌళి నాన్న పేరు ముందు కూడా కేవి విజయేంద్రప్రసాద్. అసలు వాస్తవానికి వాళ్ల ఇంటి పేరు కోడూరు. ఇక కోడూరి వారి ఇంటి పెద్ద సోదరుడు కోడూరి రామారావు. ఆ తరువాత కీరవాణి వాళ్ల నాన్న కోడూరు శివశక్తి దత్త. ఆ తరువాత కోడూరి కాశి, ఇక రాజమౌళి నాన్న కోడూరి విజయేంద్ర ప్రసాద్. ఇక వీరి ఇంటి పేరు కోడూరి అయితే వీరు ఎం.ఎం. కీరవాణి, ఎస్. ఎస్. రాజమౌళి అనే అనుమానం చాలా మందికి కలుగుతుంది.
Advertisement
Advertisement
ఎం.ఎం. కీరవాణి పూర్తి పేరు మరకతమని కీరవాణి, దర్శక ధీరుడు రాజమౌళి అసలు పేరు శ్రీశైలం శ్రీరాజమౌళి. అలా వారి పేర్ల ముందు ఆ అక్షరాలు వచ్చాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ రచయిత ఇక రాజమౌళి, కీరవాణి గురించి తెలిసిన విషయమే. కీరవాణి సోదరి శ్రీలేఖ కూడా సంగీత దర్శకురాలే. కీరవాణి తమ్ముడు కల్యాణి మాలిక్ కూడా మ్యూజిక్ డైరెక్టర్. అదేవిధంగా బాహుబలి సినిమాకు కల్యాణ్ మాలిక్ నేపథ్య సంగీతమందించారు. కీరవాణి తండ్రి శివశక్తి దత్త చంద్రమోహన్ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. కీరవాణి గారిని చక్రవర్తి గారి వద్ద సంగీతంలో శిక్షణ కోసం కోడూరి కాశి చేర్పించడం విశేషం.
Also Read :
మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారా..? ఇది వాస్తవమేనా..?
సమంత ఇన్‌స్టాలో కేటీఆర్ పోస్ట్.. షాక్‌లో అభిమానులు.. అసలు ఏం జరిగిందంటే..?