Home » మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారా..? ఇది వాస్త‌వ‌మేనా..?

మెగాస్టార్ చిరంజీవి పేరు మార్చుకున్నారా..? ఇది వాస్త‌వ‌మేనా..?

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అద్భుత‌మైన న‌ట‌న‌, స్టైలిష్ డ్యాన్స్ తో కోట్లాది మంది ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ను గెలుచుకున్నారు. కొన్ని ద‌శాబ్దాలుగా టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొన‌సాగుతూ ఉన్నారు చిరంజీవి. చిరంజీవి పేరు మార్చుకున్నారా..? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ప‌క్కా ప్రూఫ్ కూడా దొర‌క‌డంతో చిరంజీవి పేరు మార్పుకు సంబంధించిన వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

ఇంత‌కు అస‌లు చిరంజీవి పేరు మార్చుకున్నార‌నే వార్త బ‌య‌టికి రావ‌డానికి గాడ్ ఫాద‌ర్ మూవీ అప్‌డేట్ కార‌ణ‌మ‌నే చెప్పాలి. చిరంజీవి హీరోగా న‌టిస్తున్న కొత్త సినిమా గాడ్ ఫాద‌ర్ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ వీడియోలో చిరంజీవి పేరులో చిన్న‌మార్పు క‌నిపించ‌డంతో ఒక్క‌సారిగా సినీ వ‌ర్గాల్లో ఇందుకు సంబంధించిన ప‌లు చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. గాడ్‌ఫాద‌ర్ టీజ‌ర్‌లో ఈఈకి బ‌దులు అద‌నంగా మ‌రో ఈ ప‌డ‌డం ప‌డింది. అయితే ఇది కేవ‌లం పొర‌పాటు మాత్ర‌మే చిత్ర యూనిట్ స్ప‌ష్టం చేసింది. చిరంజీవి పేరు మార్చుకున్నాడ‌ని సోష‌ల్ మీడియాలో వస్తున్న క‌థనాల్లో ఎలాంటి వాస్త‌వం లేద‌ని.. ఆ పొర‌పాటు వెంట‌నే స‌రిచేసుకున్నామ‌ని చిత్ర బృందం పేర్కొంటుంది. సినిమాకు సంబంధించి సాంగ్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉండ‌గా.. దానిని కూడా జులై 07 నుంచి షూట్ చేస్తున్నారు.

Advertisement


ఇక మ‌రొక‌వైపు త‌ల‌కొన‌లో జ‌రుగ‌బోయే చిన్న షెడ్యూల్ చిరంజీవి కూడా పాల్గొంటార‌ని తెలుస్తుంది. రాజ‌కీయ ప్ర‌యాణం అనంత‌రం తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు చిరంజీవి. ఖైదీ నెంబ‌ర్ 150, సైరా న‌ర‌సింహారెడ్డి లాంటి సినిమాల‌తో హిట్స్ అందుకున్నారు. ఇక ఈ సినిమాలు రెండు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్లు సాధించాయి. ఇటీవ‌ల త‌న కుమారుడితో క‌లిసి చేసిన ఆచార్య సినిమా బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ అయింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో భోళాశంక‌ర్ సినిమా చేస్తున్నారు మెగాస్టార్‌. తెలుగు రీమెక్ గా ఈ సినిమా తెర‌కెక్క‌తుంది. మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల‌యాళ లూసిఫ‌ర్ తెలుగు రీమెక్ గాడ్ ఫాద‌ర్‌, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో వాల్తేరు వీర‌య్య వంటి సినిమాల్లో న‌టిస్తున్నారు.

Also Read : 

నందమూరి బాలకృష్ణ కి ‘బాలయ్య’ అని పేరు ఎందుకు వచ్చింది ? ఎవరు ఆ పేరుని ఇచ్చారంటే ?

తరుణ్, ఉదయ్ కిరణ్ కలిసి నటించాల్సిన సినిమా మధ్యలో ఎందుకు మిస్ అయ్యింది ? ఎవరు ఆపేసారు ?

 

Visitors Are Also Reading