Home » స‌మంత ఇన్‌స్టాలో కేటీఆర్ పోస్ట్.. షాక్‌లో అభిమానులు.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

స‌మంత ఇన్‌స్టాలో కేటీఆర్ పోస్ట్.. షాక్‌లో అభిమానులు.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

by Anji
Ad

స్టార్ హీరోయిన్ స‌మంత సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. త‌న‌కు సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని ఫాలోవ‌ర్స్‌తో పంచుకోవ‌డ‌మే కాదు జీవితానికి సంబంధించిన కోట్స్ ను షేర్ చేస్తుంటుంది. విడాకుల అనంత‌రం ప్ర‌తి విష‌యంపై నెట్టింట స్పందించింది స‌మంత‌. ఇక అప్ప‌టి నుంచి స‌మంత ఏ పోస్ట్ చేసిన వార్త‌ల్లోకి ఎక్కుతోంది. ఈ త‌రుణంలో ఇటీవ‌ల ఆమె చేసిన ఓ పోస్ట్ అంద‌రికీ షాక్ ఇచ్చింది.


ఎప్పుడు త‌న సినిమాల అప్‌డేట్స్, సామాజిక అంశాలు ఎమోష‌న‌ల్ కోట్స్‌, త‌న పెట్స్ కు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ అవే లోకంగా ఉండే స‌మంత తొలిసారి రాజ‌కీయాల‌కు సంబంధించి పోస్ట్ చేసింది. కేటీఆర్ ఫోటో షేర్ చేస్తూ నా ప్ర‌జ‌లే నా బం, నాధైర్యం, నా న‌మ్మ‌కం అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది. ఇది చూసి ఆమె ఫాలోవ‌ర్స్, అభిమానులంతా షాక్ కు గుర‌య్యారు. ఏంటీ స‌మంత రాజ‌కీయాల‌పై స్పందించిందంటూ నెటిజ‌న్లు చ‌ర్చించుకున్నారు. సినిమాల‌కు గుడ్ బై చెప్పి రాజ‌కీయాల్లో వ‌స్తున్నావా..? సామ్ అంటూ ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు నెటిజ‌న్లు.

Advertisement

Advertisement


ఈ పోస్ట్‌పై స‌మంత డిజిట‌ల్ మేనేజ‌ర్ శేషాంక బినాష్ స్పందించింది. ఇది స‌మంత చేసిన పోస్ట్ కాద‌ని.. స‌మంత ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్‌కు గురైంద‌ని వెల్ల‌డించింది. టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల ఇలా జ‌రిగింది. ఓ గ్రూపులో పోస్ట్ చేయాల్సి పోస్ట్ స‌మంత గ్రూప్‌లో యాడ్ అయింది. ఈ పోస్ట్ ఎవ్వ‌రూ చేశార‌నే దానిపై ఆరా తీస్తున్నాం. దీనిపై మా ఇన్‌స్టా గ్రామ్ టీమ్ తో చ‌ర్చిస్తున్నాం. వారెవ్వ‌రో తెలిసిన వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్పష్టం చేసింది. మ‌రోమారు ఇలాంటి పొర‌పాటుజ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతాం. మీకు అసౌక‌ర్యం, క‌న్ప్యూజ‌న్ క‌లిగించినందుకు క్ష‌మాప‌ణ‌లంటూ ఆమె పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ను స్క్రీన్ షాట్‌ను స‌మంత త‌న ఇన్‌స్టా స్టోరీలో ఫ్యాన్స్‌తో పంచుకుంది.

Also Read : 

మ‌రో పెళ్లి చేసుకోనున్న పంజాబ్ సీఎం.. పెళ్లి కూతురు ఎవ‌రంటే..?

వర్షం సినిమాలోని ఈ సీన్స్ లో మనకు కనిపించిన స్టార్ డైరెక్టర్ ని గుర్తు పట్టరా ?

 

Visitors Are Also Reading