Home » హీరోగా నటించాల్సిన డీఎస్పీ ఎందుకు డ్రాప్ అయ్యాడు…ఎవరు వద్దన్నారో తెలుసా…!

హీరోగా నటించాల్సిన డీఎస్పీ ఎందుకు డ్రాప్ అయ్యాడు…ఎవరు వద్దన్నారో తెలుసా…!

by AJAY
Ad

రాక్ స్టార్ దేవీ శ్రీప్రసాద్ టాలీవుడ్ లో సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో సినిమాలకు దేవిశ్రీ సూపర్ హిట్ పాటలను అందించాడు. తన మ్యూజిక్ తో దేవి శ్రీ ప్రసాద్ కుర్రాళ్ళతో పాటూ ముస‌లి వాళ్ల‌ను సైతం స్టెప్పులు వేయించాడు. దాదాపు టాలీవుడ్ లోని బడా హీరోలందరి సినిమాలకు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకూర్చారు. అయితే కొంతకాలంగా దేవిశ్రీప్రసాద్ కెరీర్ గా డౌన్ అయిన‌ట్టు కనిపిస్తుంది. వ‌రుస సినిమాలు చేయాల్సిన డీఎస్పీ ఒక్కో సినిమాకు చాలా గ్యాప్ ఇస్తున్నాడు.

devisriprasad

devisriprasad

కానీ రీసెంట్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో దేవీ శ్రీ పుష్ఫ సినిమా ఆల్బ‌మ్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ సినిమా పాట‌లు యూట్యూబ్ ను షేక్ చేశాయి. ఈ సినిమాలోని పాటలతో పాటూ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా తర్వాత దేవిశ్రీప్రసాద్ మళ్ళీ వరుస ఆఫర్లు అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే దేవిశ్రీప్రసాద్ ఆడియో ఫంక్షన్స్ లో ఎంతో హుషారుగా కనిపిస్తార‌న్న‌ సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement

devisriprasad

చూడ్డానికి స్టైలిష్ గా కనిపిస్తూ ఫుల్ జోష్ గా ఉండే దేవిశ్రీప్రసాద్ హీరోగా కూడా సక్సెస్ అవుతారని చాలామంది అనుకున్నారు. అంతేకాకుండా పలు ఆడియో ఫంక్షన్స్ లో ప్రముఖులు సైతం దేవిశ్రీప్రసాద్ హీరోగా సినిమా చేయాలని అనేవారు. దాంతో దేవి శ్రీ ప్రసాద్ కూడా హీరోగా నటించేందుకు సిద్ధమయ్యాడు.

కానీ ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్న తనను ప్రేక్షకులు అంగీకరిస్తారా లేదా అన్న అనుమానం దేవీశ్రీ కి వ‌చ్చిందట‌. దాంతో దేవిశ్రీప్రసాద్ సన్నిహితులు ఆయ‌న‌తో….ఒకవేళ అదే గనుక జరిగితే మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా కెరీర్ దెబ్బతింటుందని హెచ్చరించారట‌. ఈ నేపథ్యంలోనే దేవిశ్రీ ప్రసాద్ కూడా పునరాలోచన చేసి హీరోగా ఎంట్రీ ఇవ్వ‌కూడ‌ద‌ని మ్యూజిక్ డైరెక్ట‌ర్ గానే కొన‌సాగాల‌ని డిస్తైడ్ అయ్యార‌ట‌.

ALSO READ :

విక్ట‌రీ వెంక‌టేష్ కూతురుని ఎప్పుడైనా చూశారా..? హీరోయిన్ల‌ను మించిన ఫాలోయింగ్ ఆమె సొంతం..!

Visitors Are Also Reading